కొన్నాళ్లుగా మెగా అండ్ అల్లు ఫ్యామిలీల మధ్య దూరం పెరిగిందంటూ మీడియాలో వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఇటీవల కాలంలో మెగా ఫ్యామిలీతో అల్లు అర్జున్(Allu Arjun) సన్నిహితంగా మెలుగుతున్న ఫోటోలు చాలానే బయటకి వచ్చాయి.తాజాగా అల్లు శిరీష్ ప్రీ-వెడ్డింగ్ సెలబ్రేషన్స్ లో మరోసారి మెగా ఫ్యామిలీతో అల్లు అర్జున్ సరదాగా గడిపిన క్షణాలకి సంబంధించిన ఫోటోలు బయటకు వచ్చాయి.
ముక్యంగా తమ్ముడు శిరీష్ దంపతుల కోసం అల్లు అర్జున్ స్వయంగా ప్రైవేట్ పార్టీని హోస్ట్ చేయడం జరిగింది. దీనికి రామ్ చరణ్ తన సతీమణి ఉపాసనతో కలిసి హాజరయ్యారు. దీనికి సంబంధించిన ఫోటో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. దీనికి ‘బ్రోమాన్స్ రీలోడెడ్’ అంటూ సోషల్ మీడియాలో కొంతమంది నెటిజెన్లు కామెంట్లు పెడుతున్నారు. బన్నీ,చరణ్ చిన్నప్పటి నుండి కలిసి పెరిగారు.
ప్రొఫెషనల్ వీరి మధ్య పోటీ వాతావరణం ఏర్పడింది.వీరు కూడా దాన్ని ఛాలెంజింగ్ గా తీసుకున్నారు. ముఖ్యంగా అల్లు అర్జున్ మెగా ఇమేజ్ కి దూరంగా ఉంటూ తన బ్రాండ్ వాల్యూ పెంచుకోవాలని కష్టపడుతున్నాడు. ఫ్యామిలీ విషయాలకి వచ్చేసరికి అందరూ సమానమే అని ఎప్పటికప్పుడు చాటిచెబుతూనే ఉన్నాడు. తన సొంత తమ్ముడి కోసం ఏర్పాటు చేసిన ప్రైవేట్ పార్టీకి చరణ్‌ను దంపతులను ఆహ్వానించడం ఇందుకు ఉదాహరణగా చెప్పుకోవచ్చు.
అయితే చరణ్ ఈ ఫోటోలో అయ్యప్ప మాలలో దర్శనమిచ్చారు. ఇక ఉపాసన బ్లాక్ ఔట్ఫిట్స్ లో కనిపించారు. ఇటీవల ఈ దంపతులకి కవల పిల్లలు జన్మించిన సంగతి తెలిసిందే.