Dil Raju: ఫ్యామిలీతో కలిసి వెకేషన్ ఎంజాయ్ చేస్తున్న దిల్ రాజు..వైరల్ అవుతున్న లేటెస్ట్ ఫోటోలు.!

  • June 10, 2024 / 05:30 PM IST

టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు (Dil Raju) అందరికీ సుపరిచితమే. ఎన్నో విజయవంతమైన ప్రేక్షకులకు అందించిన దిల్ రాజు.. పర్సనల్ లైఫ్ కూడా అందరికీ తెరిచిన పుస్తకమే. ఆయన మొదటి భార్య అనిత గారు చనిపోవడంతో కూతురి ఒత్తిడి మేరకు రెండో పెళ్లి చేసుకున్నారు. తేజస్విని అనే అమ్మాయిని 2020 లో రెండో పెళ్లి చేసుకున్న దిల్ రాజు ఈ మధ్యనే ఓ మగ బిడ్డకు తండ్రయ్యాడు. ప్రస్తుతం తన ఫ్యామిలీ లైఫ్ ను ఎంజాయ్ చేస్తున్న దిల్ రాజు మరో పక్క రామ్ చరణ్ (Ram Charan) ‘గేమ్ ఛేంజర్’ (Game Changer) , నితిన్ (Nithin Kumar) ‘తమ్ముడు’ (Thammudu) సినిమాలు నిర్మిస్తున్నాడు.

అంతే కాకుండా దిల్ రాజు ఇంకా 15కిపైగా సినిమాలు రెడీ చేస్తున్నారు లని రీసెంట్‌గా తెలిసింది. ఇలా సినిమాలతో బిజీగా గడుపుతున్న రాజుగారు చిన్న గ్యాప్ ఇచ్చి.. ఫ్యామిలీతో కలిసి వెకేషన్ కి వెళ్ళారు. దిల్ రాజు భార్య తేజస్విని కొడుకు అన్వి రెడ్డితో కలిసి వెకేషన్ ఫూల్ గా ఎంజాయ్ ఎంజాయ్ చేస్తున్న ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియా వేదిక గా తెగ వైరల్ అవుతున్నాయి. ఆ ఫోటోలను మీరు కూడా ఓ లుక్కేయండి:

Read Today's Latest Gallery Update. Get Filmy News LIVE Updates on FilmyFocus