తెలంగాణా సాహసమహిళ పై బాలీవుడ్ సినిమా!

  • June 20, 2016 / 02:36 PM IST

ఈమధ్య బయోపిక్ ల హవా ఎక్కువగా నడుస్తోంది. ఆ జోనర్ లో ఒక సినిమా తెరకెక్కించేందుకు బాలీవుడ్ నటుడు దర్శకుడు రాహుల్ బోస్ సన్నద్ధమవుతున్నాడు. దాదాపు పదహారేళ్ళ తర్వాత రాహుల్ మళ్ళీ దర్శకత్వం వహించనున్నాడు.

ఆయన కథాంశంగా ఎంచుకొన్నది.. 2014లో ఎవరెస్ట్ ను అధిరోహించిన మన తెలంగాణ యువతి పూర్ణ జీవితాన్ని. ఒక సామాన్య యువతి.. ఎవరెస్ట్ ను అధిరోహించడం వెనుక ఉన్న కష్ట-నష్టాల సమ్మేళనంగా ఈ సినిమా తెరకెక్కనుంది. జూలై నుంచి రెగ్యులర్ షూటింగ్ మొదలుకానున్న ఈ చిత్రం ప్రీ-ప్రొడక్షన్ వర్క్ ప్రస్తుతం బాంబేలో జరుగుతోంది. ఇకపోతే.. ఈ సినిమాలో తెలంగాణ ఆడపడుచు పూర్ణ పాత్రను ఎవరు పోషిస్తారన్నది తెలియాల్సి ఉంది!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus