Boyapati Srinu: ఆ హీరోతో మూవీ తీయడం డ్రీమ్ అంటున్న బోయపాటి!

  • April 18, 2022 / 07:25 PM IST

ప్రముఖ స్టార్ డైరెక్టర్లలో ఒకరైన బోయపాటి శ్రీను ఇప్పటికే బాలకృష్ణ, రవితేజ, జూనియర్ ఎన్టీఆర్, అల్లు అర్జున్, రామ్ చరణ్ లతో సినిమాలను తెరకెక్కించిన సంగతి తెలిసిందే. చరణ్, ఎన్టీఆర్ లకు హిట్ ఇవ్వలేకపోయినా మిగిలిన హీరోలకు మాత్రం బోయపాటి శ్రీను హిట్స్ ఇచ్చారు. బోయపాటి శ్రీను ప్రస్తుతం రామ్ తో ఒక సినిమాను తెరకెక్కించే పనిలో పడ్డారు. భారీ బడ్జెట్ తో ఈ సినిమా తెరకెక్కనుందని సమాచారం. అయితే ఈ స్టార్ డైరెక్టర్ మనసులో మహేష్ బాబుతో ఒక సినిమాను తెరకెక్కించాలని ఉంది.

Click Here To Watch NOW

తాజాగా ఒక సందర్భంలో బోయపాటి శ్రీను ఈ విషయాలను చెప్పుకొచ్చారు. మహేష్ ఛాన్స్ ఇస్తే బ్రహ్మాండమైన మాస్ యాక్షన్ థ్రిల్లర్ తీస్తానని బోయపాటి శ్రీను అన్నారు. మహేష్ బాబుతో సినిమా తీయడం డ్రీమ్ అని బోయపాటి శ్రీను తెలిపారు. బోయపాటి శ్రీనుకు మహేష్ ఛాన్స్ ఇస్తారో లేదో చూడాల్సి ఉంది. బోయపాటి శ్రీనుకు మహేష్ ఓకే చెప్పినా ఈ కాంబినేషన్ లో సినిమా పట్టాలెక్కాలంటే మాత్రం చాలా సమయం పట్టే ఛాన్స్ అయితే ఉందని చెప్పవచ్చు.

మహేష్ బాబు ప్రస్తుతం సర్కారు వారి పాట సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమా విడుదలైన తర్వాత మహేష్ త్రివిక్రమ్, రాజమౌళి సినిమాలను పూర్తి చేయాల్సి ఉంది. ఈ సినిమాలు పూర్తైన తర్వాతే మహేష్ కొత్త సినిమాలపై దృష్టి పెట్టే ఛాన్స్ ఉంది. మహేష్ బోయపాటి శ్రీను కాంబినేషన్ బాగుంటుందని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. అయితే బోయపాటి శ్రీను భవిష్యత్తు ప్రాజెక్ట్ లు కూడా సక్సెస్ సాధిస్తే మాత్రమే మహేష్ బాబు బోయపాటికి ఛాన్స్ ఇచ్చే అవకాశం ఉంది.

అఖండ సక్సెస్ తో బోయపాటి శ్రీను రెమ్యునరేషన్ ఊహించని స్థాయిలో పెరిగిందని సమాచారం అందుతోంది. రామ్ సినిమాతో బోయపాటి శ్రీను ఎలాంటి ఫలితాన్ని అందుకుంటారో చూడాల్సి ఉంది. రామ్ బోయపాటి కాంబోలో తెరకెక్కుతున్న తొలి మూవీ ఇదే కావడం గమనార్హం.

‘కె.జి.ఎఫ్2’ నుండీ అదిరిపోయే 23 డైలాగులు ఇవే..!

Most Recommended Video

‘ఆర్.ఆర్.ఆర్’ తో పాటు ఫస్ట్ వీక్ తెలుగు రాష్ట్రాల్లో భారీ వసూళ్ళను రాబట్టిన సినిమాల లిస్ట్..!
తెలుగులో అత్యధిక థియేట్రికల్ బిజినెస్ చేసిన సినిమాల లిస్ట్..!
‘ఆర్.ఆర్.ఆర్’ తో పాటు బాక్సాఫీస్ వద్ద భారీ లాభాలను అందించిన 10 సినిమాల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus