సినీ ఇండస్ట్రీలో వరుస విషాదాలు చోటు చేసుకోవడం చూస్తూనే ఉన్నాం. ఈ మధ్య కాలంలో చూసుకుంటే టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు తండ్రి మరణించిన సంగతి తెలిసిందే. అటు తర్వాత స్టార్ నటుడు నాజర్ తండ్రి కూడా కన్నుమూశారు.అలాగే మలయాళ నటుడు కుందర జానీ, విజయ్ ఆంటోనీ పెద్ద కూతురు,బాలీవుడ్ నటి భైరవి ఇలా చాలా మంది కన్నుమూశారు. తాజాగా ఓ స్టార్ డైరెక్టర్ ఇంట్లో కూడా విషాదం చోటు చేసుకుంది.
ఆ స్టార్ డైరెక్టర్ (Hari) తండ్రీ కన్నుమూయడంతో విషాద ఛాయలు ఏర్పడ్డాయి. ఈ ఘటన తమిళ సినీ పరిశ్రమలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. ‘సింగం’ దర్శకుడైన హరి తండ్రి ఈరోజు కన్నుమూశారు. కొంత కాలంగా హరి తండ్రి అయిన వీఏ గోపాలకృష్ణన్ అనారోగ్య సమస్యలతో బాధపడుతూ వస్తున్నారు. దీంతో చెన్నైలోని ఓ ఆసుపత్రిలో ఆయన్ని ఉంచి మెరుగైన చికిత్స అందించారు కుటుంబ సభ్యులు.
అయితే చికిత్స పొందుతూ శనివారం నాడు వీఏ గోపాలకృష్ణన్ కన్నుమూసినట్టు తెలుస్తుంది. దీంతో దర్శకుడు హరి తండ్రి కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఈ క్రమంలో కొందరు సినీ, రాజకీయ ప్రముఖులు హరికి అలాగే వారి కుటుంబ సభ్యులకు ధైర్యాన్ని ప్రసాదించాలని, అలాగే గోపాలకృష్ణన్ ఆత్మకు శాంతి చేకూరాలని సానుభూతి తెలిపారు. ఇక హరి దర్శకత్వం వహించిన ‘ఆరు’ ‘యముడు’ ‘సింగం’ ‘సింగం 3 ‘ ‘పూజ’ వంటి సినిమాలు తెలుగులో కూడా సక్సెస్ అయిన సంగతి తెలిసిందే.
భగవంత్ కేసరి సినిమా రివ్యూ & రేటింగ్!
లియో సినిమా రివ్యూ & రేటింగ్!
టైగర్ నాగేశ్వరరావు సినిమా రివ్యూ & రేటింగ్!