టాలీవుడ్ స్టార్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ ఇటీవల హర్ట్ అవుతూ చేసిన కామెంట్స్ టాక్ ఆఫ్ ది టౌన్ అయ్యాయి. మేటర్ ఏంటంటే.. టాలీవుడ్ హీరోయిన్ అయిన రకుల్ ప్రస్తుతం తెలుగులో అవకాశాలు లేకపోవడం విచారకరం అంటూ ఓ పత్రిక కథనం రాసుకొచ్చింది.ఇది కాస్త రకుల్ ను బాగా హర్ట్ చేసింది. ‘ఇప్పుడు నేను ఎన్ని సినిమాల్లో నటిస్తున్నానో మీకు తెలుసా?’ అంటూ ఆమె మండిపడింది. ప్రస్తుతం రకుల్ బాలీవుడ్లో 6 కి పైగా సినిమాల్లో నటిస్తోందట.
‘ఓ సంవత్సరానికి 365 రోజులు ఉంటాయి కదా అని…అన్ని రోజులు సినిమాల్లో నటించలేము కదా?’ అంటూ ఘాటుగా స్పందించింది.రకుల్ ఆవేదనను అర్ధం చేసుకుని.. చాలా మంది ఆమెకు మద్దతు పలికారు. ఈ నేపథ్యంలో దర్శకుడు హరీష్ శంకర్ కూడా రకుల్ కు మద్దతు పలికి ఆమెకు అండగా నిలిచాడు.’ ఇండస్ట్రీలో మంచి పేరు సంపాదించుకున్న నా స్నేహితుడు ఒకాయన.. ఇటీవల రకుల్ కు కథ చెప్పడానికి వెళ్తే..ఆమె డేట్స్ లేవని చెప్పింది.
ఆమె అంత ఖాళీగా ఉంటే అతని ఆఫర్ కు నొ చెప్పదు కదా..! దీనిని బట్టి ఆమె ఎంత బిజీగా ఉంది అన్న విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి.కెరీర్ లో దూసుకుపోతూ.. నీ పనితనంతోనే విమర్శకుల నోళ్లు మూయించు’ అంటూ హరీష్ శంకర్ పేర్కొన్నాడు.ఇక ‘ఉప్పెన’ హీరో వైష్ణవ్ తేజ్ తో రకుల్ చేసిన మూవీ విడుదలకు సిద్ధంగా ఉంది.