మలయాళ స్టార్ డైరెక్టర్ ప్రియదర్శన్(Priyadarshan) గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఒకప్పుడు ఎన్నో సూపర్ హిట్ సినిమాలు అందించారు. హిందీలో కూడా ఈయన సూపర్ హిట్ సినిమాలు అందించారు. ఇక ఒకప్పటి స్టార్ హీరోయిన్ లిస్సీని ఈయన పెళ్ళాడిన సంగతి తెలిసిందే.
అయితే 9 ఏళ్ళ క్రితం వీళ్ళు విడాకులు తీసుకుని సెపరేట్ అయిపోయారు. అయితే ఇప్పుడు మళ్లీ వీళ్ళు కలిసిపోయినట్టు టాక్ నడుస్తుంది. 1990 లో పెళ్ళి చేసుకున్న ప్రియదర్శన్, లిస్సీ జంట.. 26 ఏళ్ల సుదీర్ఘ వైవాహిక బంధం తర్వాత, మనస్పర్థల తలెత్తడంతో 2014లో సెపరేట్ అయిపోయారు.
2016లో వీళ్ళకి విడాకులు మంజూరు అయ్యాయి.అయితే 8 ఏళ్ళ తర్వాత మళ్లీ కలిసిపోవాలని వీళ్ళు డిసైడ్ అయినట్టు వార్తలు వినిపించాయి.పిల్లల భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకుని వారి సంతోషం నిమిత్తం వీళ్ళు తిరిగి ఒక్కటైనట్టు తెలుస్తుంది. వీరి కుమార్తె కళ్యాణి ప్రియదర్శన్ వివాహం త్వరలో జరగనున్నట్టు ప్రచారం జరుగుతుంది. దానిని తల్లిదండ్రులు జరిపించాలని కళ్యాణి కోరినట్టు ఇన్శైడ్ టాక్.
ఇటీవల ప్రియదర్శన్ పాల్గొన్న ఒక ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ ‘మేమిద్దరం కలిసి మళ్లీ మా పాత జీవితాన్నే జీవిస్తున్నాం’ అంటూ తెలిపారు.ప్రియదర్శన్, లిస్సీ 1990లో ప్రేమ వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. వీరికి కళ్యాణి ప్రియదర్శన్, సిద్ధార్థ్ ప్రియదర్శన్ ఇద్దరూ సంతానం. ఆస్తి తగాదాల కారణంగా వీళ్ళు కోర్టు మెట్లు ఎక్కినట్టు ఓ టాక్ ఉంది. ఏదైతేనేం.. మళ్ళీ వీళ్ళు తిరిగి కలిసిపోవడం అనేది శుభ పరిణామం. వీరి బాటలోనే మరిన్ని జంటలు నడుచుకోవాలని ఆశిద్దాం..!