Yash: కియారకు బాడీగార్డ్‌గా మారిపోయాం: యశ్‌ కామెంట్స్‌ వైరల్‌

‘టాక్సిక్‌’ సినిమా గురించి ప్రస్తుతం ట్రైలర్‌ గురించి మాట్లాడుతున్నారు కానీ.. మొన్నీ మధ్య వరకు యశ్‌ – కియారా అడ్వాణీ మధ్య ఉన్న సన్నివేశాల గురించే మాట్లాడుకున్నారు. దానికి కారణం ఆ సినిమా నుండి అప్పటివరకు వచ్చిన ప్రచార చిత్రాలే. వాటిలో ఇద్దరి మధ్య ఉన్న సన్నివేశాలు, సాన్నిహిత్యమే. అయితే సినిమా ట్రైలర్‌ చూశాక.. మొత్తం మారిపోయింది. ‘టాక్సిక్‌’ అంటే కేవలం ఆ సీన్లు మాత్రమే కాదు.. ఇంకా చాలా ఉంది అని టీమ్‌ చెప్పకనే చెప్పింది. మొన్నీమధ్య జరిగిన ఈవెంట్‌లో యశ్‌, గీతూ మోహన్‌ దాస్‌ (డైరక్టర్‌) అయితే కియారాను పొగిడేశారు.

Yash

ఇప్పుడు మరోసారి యశ్‌ ఈ సినిమా గురించి మాట్లాడుతూ కియారా అడ్వాణీ గురించి కూడా మాట్లాడాడు. కియార నిబద్ధత ఉన్న నటి. ఆమె సినిమా షూటింగ్‌కు వచ్చినప్పుడు తొలుత నేను కొంచెం ఆందోళన చెందాను. ఎందుకంటే ఆమె పోషించిన పాత్ర కఠినంగా ఉంటుంది. వర్షంలో తడుస్తూ చేసే ఓ సీన్‌ ఉంటుంది. ఆ సీన్‌ సులభంగా అయిపోతుంది అని అనుకున్నాం. కానీ, ఆ సన్నివేశం షూటింగ్‌ పూర్తి చేయడానికి చాలా టైమ్‌ పట్టింది. ఈ క్రమంలో కియార చాలా కష్టపడి చేసింది.

ఆ తర్వాత కొన్ని రోజులకు కియార ప్రెగ్నెంట్‌ అని తెలిసింది. అయినా ఆమె సెట్స్‌కి అంతే అంకిత భావంతో సెట్స్‌కు వచ్చింది. దీంతో నాకు, గీతూ మోహన్‌దాస్‌ టెన్షన్‌ పడ్డాం. ఒక దశంలో మేమిద్దరం సెట్‌లో కియారకు బౌన్సర్లు, బాడీగార్డ్‌లుగా మారిపోయాం. ఆమెను ఎలాంటి ఇబ్బంది లేకుండా జాగ్రత్తగా చూసుకున్నాం. కియారఅ అప్పుడు పడ్డ కష్టానికి ఇప్పుడు తగిన గుర్తింపు వస్తుంది అని నమ్ముతున్నాం అని యశ్‌ చెప్పుకొచ్చాడు.

ఇటీవల బెంగళూరులో నిర్వహించిన ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌లోనూ కియారను యశ్‌ అభినందించాడు. ఈ సినిమా ప్రకటించినప్పటి నుండి కియార ఎన్నో విమర్శలు ఎదుర్కొందని యశ్‌ చెప్పుకొచ్చాడు. అయితే ఆమె ఎవరి మాటలనూ పట్టించుకోకుండా ముందుకుసాగింది అని పొగిడేశాడు. ఇక ఈ సినిమా కోసం ఆమె పడ్డ కష్టం మనం చూడాలి అంటే ఈ నెలాఖరు వరకు వెయిట్‌ చేయాల్సిందే.

కొబ్బరికాయ కొట్టిన రోజే.. టైటిల్‌.. రిలీజ్‌ డేట్‌.. డిస్ట్రిబ్యూటర్‌లు.. ఏంటీ మాస్‌

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus