కోలీవుడ్ యాక్షన్ హీరో విశాల్ తొలిసారి మెగా ఫోన్ పట్టి చేసిన సినిమా ‘మకుటం’. ఈ సినిమా టీజర్, ట్రైలర్స్ ఆశించిన స్థాయిలో బజ్ క్రియేట్ చేయలేకపోయాయి. ఆల్మోస్ట్ ‘మార్క్ ఆంటోనీ’ స్టైల్లోనే విశాల్ కనిపిస్తుండటంతో ఎవ్వరూ హోప్స్ పెట్టుకోలేదు. ఈ ఇండిపెండెన్స్ డేకి ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ వంటి క్రేజీ సినిమాలతో పోటీపడి మరీ ‘మకుటం’ ని తెలుగు రాష్ట్రాల్లో గ్రాండ్ గా రిలీజ్ చేస్తున్నారు. కేవలం మౌత్ టాక్ పై ఆధారపడి ప్రేక్షకుల ముందుకు వచ్చిన ‘మకుటం’.. దర్శకుడిగా విశాల్ కి ఎలాంటి ఫలితాన్ని అందించిందో ఈ రివ్యూ ద్వారా తెలుసుకుందాం రండి:
కథ: ఫోస్టర్ ఫామ్ కంపెనీలో మెడికల్ రెప్..గా పనిచేస్తూ ఉంటాడు కృపాకర్. 35 వేల జీతం, భార్య జమున(దుషారా విజయన్) అలాగే ఇద్దరు పిల్లలు కలిగిన కృపాకర్ ఆర్థిక ఇబ్బందులు పడుతూనే ఫ్యామిలీ బండిని నడుపుతూ ఉంటాడు. అయితే పెళ్ళికి ముందు.. కార్ ఉంటేనే తన కూతుర్ని ఇచ్చి పెళ్లి చేస్తాను అంటూ కృపాకర్..కి జమున తండ్రి కండిషన్ పెడతాడు. ఆ టైంలో తనకు కార్ ఉందని అబద్దం చెప్పి దాటేసిన కృపాకర్.. పెళ్లి తర్వాత ఆ విషయాన్ని కవర్ చేయలేక చాలా ఇబ్బందులు పడతాడు.
ఒక దశలో కొత్త కారు కొనడానికి రెడీ అయినప్పటికీ.. అతని సిబిల్ స్కోర్ తక్కువగా ఉన్న కారణంగా బ్యాంక్ లోన్ రాదు. దీంతో ఓ సెకండ్ హ్యాండ్ కార్ కొంటాడు కృపాకర్. ఒకసారి తన ఫ్యామిలీతో కలిసి ఆ కార్లో ఔటింగ్ కి వెళ్లిన కృపాకర్ అండ్ ఫ్యామిలీపై కొంతమంది దాడి చేస్తారు. ఈ క్రమంలో అతని భార్య, కూతురు మరణిస్తారు. తర్వాత కొడుకుని కాపాడుకునే క్రమంలో ఆ రౌడీలను హతమారుస్తాడు కృపాకర్. అసలు కృపాకర్ కుటుంబం పై దాడి చేసిన వాళ్ళు ఎవరు? కృపాకర్ కి.. గ్యాంగ్స్టర్ లింగ(విశాల్) కి సంబంధం ఏంటి? లింగ భార్య అన్నపూర్ణ(అంజలి) ఏమైంది? లింగ కుటుంబానికి నాగ(అజయ్) చేసిన ద్రోహం ఏంటి? అనేది మిగిలిన సినిమా..
నటీనటుల పనితీరు: విశాల్ కృపాకర్ పాత్రలో బాగానే చేశాడు. కానీ గ్యాంగ్స్టర్ లుక్ ఎందుకో ఇతనికి సెట్ అవ్వలేదు. ‘కబాలి’ గెటప్ విశాల్ వేసుకున్నట్టు అనిపిస్తుంది. అలాగే అంజలి చనిపోయే సన్నివేశంలో విశాల్ నటన ట్రోలింగ్ మెటీరియల్ ఫీల్ ఇస్తుంది. అంజలి విషయానికి వస్తే.. మొన్నామధ్య స్లిమ్ అయిన అంజలి.. ఎందుకో ఈ సినిమాలో మాత్రం కొంచెం ఒళ్ళు చేసినట్టు కనిపించింది. యాక్టింగ్ మాత్రం ఓవర్ ది టాప్ అన్నట్టు ఉంటుంది. దుషార విజయన్ బాగానే చేసింది. జాన్ విజయ్, రవి ప్రకాష్ బాగానే చేశారు. ఝాన్సీ పాత్ర ఎందుకు ఉందో ఆమెకే తెలియాలి. మిగతా నటీనటుల పాత్రలు గుర్తుంచుకునే రేంజ్లో ఉండవు.
సాంకేతిక నిపుణుల పనితీరు: ‘మకుటం’ సినిమా కథ పరంగా కొత్తగా ఏమీ అనిపించదు. గతంలో వచ్చిన నాగార్జున ‘వారసుడు’ నుండి మొన్నామధ్య వచ్చిన విజయ్ ‘లియో’ వరకు చాలా సినిమాల ఛాయలు కనిపిస్తాయి. ఈరోజుల్లో కొత్త కథలు పుట్టుకురావడం అనేది కష్టమే. స్క్రీన్ ప్లేతోనే మేజిక్ చేసి ఎక్స్పీరియన్స్ ఇవ్వాలి దర్శకులు. ఆ విషయంలో ఇక్కడ విశాల్ అన్ని విధాలుగా ఫెయిల్ అయ్యాడు అని చెప్పాలి.
సినిమా స్టార్టింగ్ నుండి ఒక్కటంటే ఒక్క హై ఇచ్చే సన్నివేశం కనిపించదు. సినిమా స్టార్టింగ్ లో వచ్చే క్రింజ్ కామెడీ సీన్స్ చాలా ఇరికిటేటింగ్ గా అనిపిస్తాయి. కాకపోతే నిజజీవితంలో కొంతమంది జనాలు ఒక సెంటిమెంట్ ఫీల్ అవుతారు. అందులో ఒకటి సెకండ్ హ్యాండ్ వస్తులు కొనడం. అవును ‘సెకండ్ హ్యాండ్ వస్తువులు కొంటే.. వాటి ఓనర్ల నెగిటివిటీ అంతా కూడా కొన్నవాళ్ళని తగులుకుంటుంది’ అనేది ఆ నెగిటివ్ సెంటిమెంట్.
దర్శకుడు విశాల్ ఈ పాయింట్ తోనే కథ డిజైన్ చేసుకున్నట్టు ఉన్నాడు. ఆ రకంగా చూస్తే.. పాయింట్ మంచిదే అనిపించొచ్చు. కానీ ఇంతకు ముందు చెప్పుకున్నట్టు స్క్రీన్ ప్లే అంతా పాత సినిమాలను పోలి ఉంటుంది. టెక్నికల్ గా చూసుకుంటే యాక్షన్ కొరియోగ్రాఫర్స్ ఎక్కువ డ్యూటీ చేసినట్టు ఉన్నారు. ఫస్ట్ హాఫ్ లో వచ్చే ఓ ఫారెస్ట్ ఫైట్, ప్రీ క్లైమాక్స్ లో వచ్చే ఓ యాక్షన్ సన్నివేశం బాగున్నాయి అనిపిస్తాయి. సినిమాటోగ్రఫీ, సంగీతం, ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి. కానీ రన్ టైం 3 గంటలు పైనే ఉండటం మరో మేజర్ మైనస్ పాయింట్.
విశ్లేషణ: ‘మకుటం’ కథ,కథనాల పరంగా కొత్తగా ఏమీ అనిపించవు. సెకండాఫ్ ను చూస్తే.. ఇది ఓటీటీకి వెబ్ సిరీస్..గా తీసుంటే బాగుండేది అనిపిస్తుంది. థియేటర్లలో అన్ని రకాలుగా ఈ సినిమా నిలబడటం కష్టమే.
ఫోకస్ పాయింట్: బోరింగ్ యాక్షన్ డ్రామా
రేటింగ్: 1.5/5