డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్, క్రేజీ హీరో విజయ్ దేవరకొండ కాంబినేషన్‌లో సినిమా!

డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్, క్రేజీ హీరో విజయ్ దేవరకొండ కాంబినేషన్‌లో ఓ సినిమా ప్రారంభం కానుంది. రీసెంట్‌గా విడుదలైన `ఇస్మార్ట్ శంకర్`తో బ్లాక్ బస్టర్ హిట్ సాధించారు పూరి జగన్నాథ్. ఈ చిత్రం ఇంకా సక్సెస్‌ఫుల్‌గా రన్ అవుతోంది. ఇలాంటి తరుణంలో విజయ్ దేవరకొండ, పూరి జగన్నాథ్ కాంబినేషన్‌లో రూపొందబోయే చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. పూరి జగన్నాథ్ టూరింగ్ టాకీస్, పూరి కనెక్ట్స్ పతాకాలపై పూరి, చార్మి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. త్వరలోనే సినిమాలో ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలను ప్రకటిస్తామని చిత్ర యూనిట్ తెలిపింది.

విజయ్ దేవరకొండ హీరోగా నటిస్తున్న ఈ చిత్రానికి రచన, దర్శకత్వం: పూరి జగన్నాథ్, సమర్పణ: లావణ్య, నిర్మాతలు: పూరి జగన్నాథ్, చార్మి కౌర్, బ్యానర్స్: పూరి జగన్నాథ్ టూరింగ్ టాకీస్, పూరి కనెక్ట్స్.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus