‘కింగ్’ నాగార్జునతో కె.రాఘవేంద్ర రావు గారు తెరకెక్కించిన ‘ఓం నమో వేంకటేశాయ’ చిత్రం మంచి టాక్ నే సంపాదించుకున్నప్పటికీ ఎందుకో యూత్ ను ఆకర్షించలేక విజయం సాధించలేకపోయింది. ఆ చిత్రం తరువాత మన దర్శకేంద్రుడు మరో సినిమా డైరెక్ట్ చెయ్యలేదు. దాంతో ఇక డైరెక్షన్ కు ఆయన గుడ్ బై చెప్పేసినట్టే అని ప్రచారం జరిగింది.కానీ ఓ మంచి హిట్ ఇచ్చే కెరీర్ కు రిటైర్మెంట్ ప్రకటించాలని రాఘవేంద్ర రావు గారు భావిస్తున్నారట.
అందుకే `పెళ్ళిసందడి` పేరుతో ఓ చిత్రాన్ని అనౌన్స్ చేశారు. ఈ చిత్రాన్ని ఆయనే డైరెక్ట్ చేస్తారని అంతా అనుకున్నారు కానీ ఎందుకో ఆయన సడెన్ గా డ్రాప్ అయినట్టు తెలుస్తుంది. ఈ చిత్రం దర్శకత్వ బాధ్యతల్ని గౌరీ రోనకి అప్పగిండం గమనార్హం. దీనికి రెండు కారణాలు అయ్యుండొచ్చని ఫిలింనగర్ విశ్లేషకులు భావిస్తున్నారు.ఒకటి ప్రభాస్ – నాగ్ అశ్విన్ ల చిత్రానికి ఈయన మెంటర్ గా వ్యవహరిస్తున్నారని కొందరు చెబుతున్నారు.
ఇంకొకటి కె.రాఘవేంద్ర రావు గారు తన చివరి చిత్రాన్ని కచ్చితంగా ఓ పెద్ద హీరోతోనే చెయ్యాలని భావిస్తున్నట్టు మరికొందరు చెబుతున్నారు.ఇవి రెండూ కాకపోతే.. ‘పెళ్ళిసందడి’ యూత్ ఫుల్ సినిమా కాబట్టి…ఇప్పటి ఆడియెన్స్ ను దృష్టిలో పెట్టుకుని.. ఆయన న్యాయం చెయ్యలేరు అని భావించి కొత్త డైరెక్టర్ కు అప్పగించి ఉండొచ్చు.