తనపై తానే శెటైర్లు వేసుకున్న దర్శకుడు!

టాలీవుడ్ లో ఒక్కో దర్శకుడు ఒక్కో రకం. అయితే కొందరు ఎలా అయినా మంచి సినిమా తియ్యలి అని ప్రయత్నిస్తూ ఉంటారు. మరికొందరు ఎలా అయినా హిట్ సినిమా తియ్యలి అని ఆలోచిస్తూ ఉంటారు. ఇంకో రకం ఉన్నారు…సమాజాం, విలువలు అనే బరువైన పదాలను నెత్తిన వేసుకుని మరీ సినిమాలు తీస్తూ ఉంటారు. అయితే నేను వాళ్ళందరిలాంటి వాడిని కాను అని, చాలా డిఫరెంట్ అని, నేను ఆ దర్శకులులాగా సినిమా చెయ్యకపోవచ్చు కానీ, వాళ్ళు మాత్రం ఖచ్చితంగా నాలాగా, నేను తీసే సినిమాలు తియ్యలేరు అంటున్నాడు…నటుడు, దర్శకుడు రవిబాబు. తాజాగా ఒక టీవీ ఛానెల్ కి ఇచ్చిన ఇంటెర్వ్యు లో మాట్లాడిన రవి బాబు. తాను చాలా డిఫరెంట్ అని, ఇంకా చెప్పాలి అంటే చాలా తేడా అని, ఆ ఇది చిన్నప్పటి నుంచి ఉంది అని అంటున్నాడు మన వాడు…

ఇక తనకు ఉన్న ప్రాబ్లమ్ ని గురించి వివరిస్తూ…”నాక్కొంచెం అబ్సెసివ్ కంపల్సివ్ డిజార్డర్ ఉంది. మా ఆవిడ మాత్రం చాలా క్యాజువల్. ఎవరన్నా న్యాప్కిన్ హోల్డర్ లో ఒక న్యాప్కిన్ సరిగ్గా పెట్టకపోయినా నాకు కోపం వచ్చేస్తుంది. అదే మా ఆవిడ అయితే.. అబ్బే అదేముంది.. మనం సరిచేద్దాంలే.. వాడినోళ్ళు సరిగ్గా పెడతారా ఏంటి అంటుంటుంది” అంటూ వాళ్ళ పర్సనల్ లైఫ్ విషయాలు కూడా చెప్పేసాడు మన దర్శకుడు. ఇక మరో పక్క ప్రస్తుతం మన వాడు ”అదుగో” అనే సినిమాతో వస్తున్నాడు రవిబాబు. ఈ సినిమాలో ఒక పంది పిల్ల ప్రధాన పాత్రలో కనిపిస్తూ ఉండడం విశేషం. మరి ఈ సినిమాతో ఎలాంటి చిత్రాన్ని మనకు అందిస్తాడో చూడాలి.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus