కోర్టులో కౌంటర్ పిటిషిన్ వేసిన శంకర్!

  • August 7, 2018 / 02:07 PM IST

కమర్షియల్ డైరక్టర్ శంకర్ తెరకెక్కించిన అద్భుత కళాఖండాల్లో రోబో(యందిరన్‌) ఒకటి. ఇందులో సౌత్ ఇండియన్ సూపర్ స్టార్ రజినీకాంత్, ఐశ్వర్యరాయ్‌ ల నటనతో పాటు గ్రాఫిక్స్, విజువల్ ఎఫెక్ట్స్ చూసి బాలీవుడ్ సైతం ఆశ్చర్యపోయింది. విదేశీయులు ఈ సినిమా చూసిన తర్వాత భారతీయ చిత్రాలను తక్కువగా అంచనా వేయకూడదని నిర్ణయానికి వచ్చారు. అంతలా ట్రెండ్ సృష్టించింది కాబట్టి ఆ చిత్రానికి సీక్వెల్ రూపుదిద్దుకుంటోంది. రజినీకాంత్ హీరోగా 2 .0 తెరకెక్కుతోంది. ఈ పనుల్లో బిజీగా ఉన్న శంకర్ కి కొత్త సమస్య వచ్చి పడింది.

2010లో రిలీజ్ అయిన రోబో కథ తనదేనని తమిళనాడుకు చెందిన ఆరూర్‌ తమిళనాథన్‌ అనే రచయిత కోర్టులో కేసు వేశారు. ఈ కేసు విచారణలో భాగంగా శంకర్‌ కోర్టుకి  హాజరుకావాల్సి వచ్చింది. అయితే శంకర్ ఈ కేసులోనూ ట్విస్ట్ ఇచ్చారు. కోర్టులో కౌంటర్‌ పిటిషన్‌ వేశారు. అందులో “యందిరన్‌’ కథ తనేదనని, ఈ కథకి, ఆరూర్‌ తమిళనాథన్‌ చెబుతున్న కథకి సంబంధమే లేదని, రెండింటిలోను చాలా వ్యత్యాసాలు ఉన్నాయి” అని శంకర్‌ స్పష్టం చేసినట్టు తెలిసింది. ఈ కథలను కోర్టు  పరిశీలించిన తర్వాత ఎటువంటి తీర్పు చెబుతుందోనని సినీ వర్గాల్లో ఆసక్తి నెలకొని ఉంది. శంకర్ ఈ కేసు విషయాన్ని పట్టించుకోకుండా 2 .0 చిత్రాన్ని వేసవిలో రిలీజ్ చేయాలనీ శ్రమిస్తున్నారు.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus