Aishwarya Shankar’s Marriage Photos: ఘనంగా శంకర్‌ కుమార్తె పెళ్లి.. ఫొటోలు వైరల్‌!

ప్రముఖ దర్శకుడు శంకర్ (S.Shankar) తన పెద్ద కూతురు ఐశ్వర్యకు ఘనంగా వివాహం చేశాడు. ఇటీవల ఘనంగా ఎంగేజ్‌మెంట్‌ జరిగిన ఐశ్వర్య, తరుణ్ కార్తికేయన్ పెళ్లి కూడా అంతే ఘనంగా చెన్నైలో ఘనంగా జరిగింది. ఈ వేడుకకు రాజకీయ, సినిమా ప్రముఖులు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. దీనికి సంబంధించిన ఫొటోలు ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి. కొత్త జంటను నెటిజన్లు తమ కామెంట్లతో ఆశీర్వదిస్తున్నారు. శంకర్ కు ఇద్దరు కుమార్తెలు, ఒక కొడుకు.

పెద్ద కుమార్తె ఐశ్వర్యకు 2021లోనే వివాహమైంది. తమిళనాడు క్రికెటర్ రోహిత్ దామోదరన్‌తో మహాబలిపురంలో పెళ్లి జరిగింది. అయితే రోహిత్‌ వివాహం జరిగిన నెల రోజులకే పోక్సో కేసులో ఇరుక్కున్నాడు. తన అకాడమీలో మహిళా క్రికెటర్‌ను వేధించాడనే ఆరోపణలు వచ్చాయి. దీంతో అతడి నుండి ఐశ్వర్య విడిపోయింది. మూడేళ్ల తర్వాత ఇప్పుడు ఇలా రెండో పెళ్లి చేసుకుంది. ఇక తరుణ్‌ కార్తికేయన్‌ గురించి చూస్తే… తరుణ్‌ కార్తికేయన్‌ అసిస్టెంట్‌ డైరెక్టర్‌ మాత్రమే కాదు.

పాటల రచయిత, ప్లే బ్యాక్‌ సింగర్‌ కూడా. శంకర్‌ దగ్గర చాలా ఏళ్లుగా సినిమాలకు పని చేస్తున్నారు. ప్రస్తుతం సెట్స్‌ మీద ఉన్న ‘భారతీయుడు 2’ (Indian 2), ‘గేమ్‌ ఛేంజర్‌’ (Game Changer) సినిమాలకూ శంకర్‌ టీమ్‌లో తరుణ్‌ కార్తికేయన్‌ ఉన్నారట. ఇక ఐశ్వర్య వృత్తి రీత్యా డాక్టర్‌. ఇక ఈ వేడుకకు సూపర్ స్టార్ రజినీకాంత్ (Rajinikanth) , లోక నాయకుడు కమల్ హాసన్ (Kamal Haasan) , స్టార్‌ హీరోలు సూర్య (Suriya), కార్తీ (Karthi) , విక్రమ్ (Chiyaan Vikram)… స్టార్‌ హీరోయిన్‌ నయనతార (Vignesh Shivan , Nayanthara) తదితరులు హాజరయ్యారు.

ఇక శంకర్‌ సినిమాల గురించి చూస్తే… కమల్‌ హాసన్‌తో తెరకెక్కించిన ‘భారతీయుడు 2’ త్వరలో ప్రేక్షకుల ముందుకొస్తుంది. ఇది కూడా ‘భారతీయుడు 3’ కూడా పూర్తయిపోయిందట. పోస్ట్‌ ప్రొడక్షన్‌ అయ్యాక ఆ సినిమా రిలీజ్‌ డేట్‌ చెబుతారట. ఇక రామ్‌చరణ్‌తో చేస్తున్న ‘గేమ్‌ ఛేంజర్‌’ షూటింగ్‌ తుది దశలో ఉంది. ఈ సినిమా రిలీజ్‌ కూడా త్వరలో అనౌన్స్‌ చేస్తారు అని అంటున్నారు.

Read Today's Latest Gallery Update. Get Filmy News LIVE Updates on FilmyFocus