సినీ సెలబ్రిటీల గురించి ఏ వార్త వచ్చినా ఇట్టే వైరల్ అయిపోతూ ఉంటుంది. ఎందుకంటే ఇది గ్లామర్ ఫీల్డ్. కాబట్టి.. జనాలకి సినిమా వాళ్లంటే స్పెషల్ అట్రాక్షన్ అని చెప్పాలి. సినిమా వాళ్ళకి సంబంధించిన ఏ వార్త గురించయినా సరే వెంటనే తెలుసుకుని.. ఖాళీ సమయాల్లో తమ స్నేహితుల గురించి చర్చించుకుంటారు. అందుకే సినిమా వాళ్ళు కూడా సోషల్ మీడియా ఖాతాల ద్వారా వారితో టచ్ లో ఉంటారు. వారి అప్డేట్స్ ను షేర్ చేస్తున్నారు.
ఈ విషయాలను పక్కన పెట్టేస్తే.. తాజాగా దర్శకుడు (Srinu Vaitla) శ్రీను వైట్ల ఇంట్లో విషాదం చోటు చేసుకుందట. ఈ విషయాన్నీ స్వయంగా ఆయనే తన సోషల్ మీడియా ద్వారా తెలియజేశారు. అలా అని ఆయన కుటుంబ సభ్యులకి ఏదో అయ్యింది అంటూ కంగారు పడకండి. ఆయన ఎంతో ఇష్టంగా చూసుకుంటున్న ఆవు చనిపోయిందట. ఈ క్రమంలో ఆయన ‘మా లక్ష్మి చనిపోయింది’ అంటూ ఎమోషనల్ పోస్ట్ పెట్టారు.అలాగే శ్రీను వైట్ల కూతుర్లు ఆ ఆవుని లక్ష్మీ అంటూ ఎంతో ఆప్యాయంగా పిలుస్తారట.
నేడు మా లక్ష్మికి సంపద్రాయంగా అంత్యక్రియలు నిర్వహిస్తున్నాం.. అంటూ ‘లక్ష్మి’ ఫోటోని కూడా షేర్ చేశాడు శ్రీను వైట్ల. ఇక సినిమాల విషయానికి వస్తే..2018 లో వచ్చిన ‘అమర్ అక్బర్ ఆంటోనీ’ తర్వాత మరో సినిమా చేయలేదు శ్రీను వైట్ల. కొద్దిరోజుల క్రితం గోపీచంద్ తో ఓ సినిమా మొదలుపెట్టాడు. కాంబినేషన్ అయితే మంచిదే కానీ..ఇద్దరూ కూడా గట్టి హిట్ కొట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది.