సినీ ప్రపంచంలో నటీనటుల ఫీజుల అంశం ఇటీవలి కాలంలో చర్చనీయాంశంగా మారింది, ముఖ్యంగా బాలీవుడ్‌లో, తారలు భారీ రెమ్యూనరేషన్ తీసుకుంటున్నారు. వారిలో అత్యంత రెమ్యూనరేషన్ తీసుకుంటున్న 10 మంది బాలీవుడ్ హీరోలు ఎవరో చూద్దాం..
1. షారూఖ్ ఖాన్
బాలీవుడ్ సూపర్ స్టార్ షారుక్ ఖాన్ యొక్క పఠాన్ ఆల్-టైమ్ ఇండస్ట్రీ హిట్‌గా నిలిచింది మరియు మునుపెన్నడూ లేని విధంగా ట్రేడ్ సర్కిల్స్ లాభాలను పొందింది. అదే జోరులో జవాన్ తో అభిమానుల ముందుకు వచ్చాడు షారుఖ్ ఖాన్ ఈ రెండు సినిమాలకు దాదాపు రూ. 100 నుంచి 200కోట్లు రెమ్యూనరేషన్ తీసుకున్నారని ట్రెడ్ పండితులు అంటున్నారు.
2. అమీర్ ఖాన్
లాల్ సింగ్ చద్దా సినిమాతో అమీర్ ఖాన్ డిజాస్టర్ ను అందుకున్నారు. ఇక ఈ సినిమా ఫ్లాప్ తర్వాత అమీర్ ఖాన్ కొంచం గ్యాప్ తీసుకున్నారు. ఇక ఇప్పుడు ఆయన తిరిగి సినిమాల్లో నటించడానికి రెడీ అవుతున్నారు. అమీర్ ఖాన్ రెమ్యునరేషన్ ఒక్కో సినిమాకు 100 కోట్ల నుంచి 175 కోట్లు తీసుకుంటున్నారు.
3. సల్మాన్ ఖాన్
బాలీవుడ్ టాప్ హీరోల లిస్ట్ లో కండల వీరుడు సల్మాన్ ఖాన్ ఒకరు. ఈయనకు బాలీవుడ్ లోనే కాదు అన్ని భాషాల్లో అభిమానులు ఉన్నారు. సల్మాన్ ఖాన్ రెమ్యునరేషన్ ఒక్కో సినిమాకు 100 కోట్ల నుంచి 150 కోట్లు .
4. అక్షయ్ కుమార్
బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ పేరు భారత్ ఈ టైటిల్ దేశ వ్యాప్తంగా మారుమ్రోతోంది. అక్షయ్ ఆర్.ఆర్.ఆర్ సినిమా లో నటించారు. ఈ హీరో రెమ్యునరేషన్ ఒక్కో సినిమాకు 60 కోట్ల నుంచి 135 కోట్లు
5. అజయ్ దేవగన్
బాలీవుడ్ లో ‘సింగం’ సిరీస్ కు ఎలాంటి క్రేజ్ ఉందో చెప్పనక్కర్లేదు. అజయ్ దేవగన్ హీరోగా ఇప్పటివరకు వచ్చిన ‘సింగం’, ‘సింగం రిటర్న్స్’ బాక్స్ ఆఫీస్ వద్ద మంచి సక్సెస్ అందుతున్నాయి. రోహిత్ శెట్టి తెరకెక్కించిన ఈ సీరిస్ నుంచి త్వరలోనే పార్ట్ 3 రాబోతుంది. అజయ్ దేవగన్ రెమ్యునరేషన్ ఒక్కో సినిమా/సిరీస్‌కు 60 కోట్ల నుంచి 120 కోట్ల
6. హృతిక్ రోషన్
బాలీవుడ్ (Bollywood) హ్యాండ్‌సమ్ హీరోల్లో టాప్ ప్లేస్‌లో ఉంటాడు హృతిక్ రోషన్ . క్రిష్, ధూమ్ 2, ఓం శాంతి ఓం సినిమాలతోపాటు పలు చిత్రాలతో సూపర్ ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్నాడు. గతేడాది విక్రమ్ వేధ సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చాడు. ఇప్పుడు వార్ -2 షూటింగ్స్ బీజీగా ఉన్నారు. రెమ్యునరేషన్: ఒక్కో సినిమాకి 75 కోట్ల నుంచి 100 కోట్లు
7. రణబీర్ కపూర్
టాలీవుడ్ సంచలన దర్శకుడు సందీప్ రెడ్డి వంగా అర్జున్ రెడ్డి మాయాజాలాన్ని హిందీలో కబీర్ సింగ్‌గా పునర్నిర్మించారు మరియు ఈ చిత్రం షాహిద్ కపూర్ కెరీర్‌లో బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచింది. ఇప్పుడు యానిమల్ సినిమాతో ముందుకు వస్తున్నాడు రెమ్యునరేషన్ ఒక్కో సినిమాకు 50 కోట్ల నుంచి 75 కోట్లు
8. రణవీర్ సింగ్
రణ్‌వీర్ సింగ్ హిందీ చిత్రాలలో కనిపించే భారతీయ చలనచిత్ర నటుడు. బాలీవుడ్‌లో అగ్ర నటుడు రణ్‌వీర్ ఒకరు. అత్యధిక పారితోషికం తీసుకునే నటుల్లో ఆయన ఒకరు. రెమ్యునరేషన్ ఒక్కో సినిమాకు 30కోట్ల నుంచి 50కోట్ల వరకు
9. షాహిద్ కపూర్
బాలీవుడ్‌లో విభిన్న రకాల పాత్రలకు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచిన నటుడు రణ్ వీర్ సింగ్. ఈ హీరో రెమ్యునరేషన్ ఒక్కో సినిమా/సిరీస్‌కు 30కోట్ల నుండి 40కోట్లు
10. వరుణ్ ధావన్
డేవిడ్ ధావన్ తనయుడు వరుణ్ ధావన్..సినిమాల తోపాటు వెబ్ సిరిస్ లు కూడా చేస్తున్నారు. రెమ్యునరేషన్ ఒక్కో సినిమాకు 25కోట్ల నుంచి 35కోట్లు