Abhiram Daggubati: దర్శకుడు తేజ-దగ్గుబాటి అభిరామ్ ల కాంబినేషన్లో ‘అహింస’..!

  • February 22, 2022 / 12:05 PM IST

తన కెరీర్‌ ప్రారంభంలో కొత్తవాళ్ళతోనే సినిమాలు చేసి ఎన్నో బ్లాక్‌బస్టర్‌లను అందుకుని ఇండస్ట్రీకి ప్రతిభావంతులైన నటీనటులను ఇండస్ట్రీకి పరిచయం చేసాడు దర్శకుడు తేజ. ఇప్పుడు మూవీ మొగల్ డి.రామానాయుడు గారి మనవడు, అగ్ర నిర్మాత సురేష్ బాబు గారి చిన్న కొడుకు, రానా దగ్గుబాటి తమ్ముడు అయిన అభిరామ్ దగ్గుబాటిని హీరోగా లాంచ్ చేసే బాధ్యతను స్వీకరించాడు. ‘ఆనంది ఆర్ట్‌ క్రియేషన్స్‌’ బ్యానర్ పై పి కిరణ్‌ నిర్మిస్తున్న ఈ చిత్రం ఓ మెసేజ్ తో కూడిన యూత్ ఫుల్ ఎంటర్టైనర్ గా ఈ చిత్రం రూపొందనుంది. ఈరోజు దర్శకుడు తేజ పుట్టినరోజు సందర్భంగా టైటిల్ మరియు ప్రీ లుక్ ను రివీల్ చేశారు.

Click Here To Watch

‘అహింస’ అనే టైటిల్‌ను ఈ చిత్రానికి పెట్టినట్టు కూడా ఖరారు చేశారు.ఈ టైటిల్ పోస్టర్ ను కనుక గమనిస్తే … హీరో అభిరామ్ మొహం సగమే కనిపిస్తుంది. మిగతా సగం ఓ సంచితో కవర్ చేసి ఉంది.రక్తపు మరకలతో కూడా అతను కనిపిస్తున్నాడు. సినిమా పేరు ‘అహింస’ అయినప్పటికీ యాక్షన్ డోస్ ఎక్కువగానే ఉండేలా కనిపిస్తుంది.ఈ చిత్రం కోసం చాలా కాలం తర్వాత దర్శకుడు తేజ మరియు సంగీత దర్శకుడు ఆర్‌.పి.పట్నాయక్‌ లు కలిసి పనిచేస్తున్నారు.

గతంలో వీరి కాంబినేషన్లో వచ్చిన సినిమాలు అన్నీ సూపర్ హిట్ అయ్యాయి. ‘అహింస’ షూటింగ్ ఇప్పటికే పూర్తయ్యింది.ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. త్వరలోనే ఈ చిత్రం విడుదల తేదీని ప్రకటించనున్నారు మేకర్స్. మరి డెబ్యూ మూవీతో అభిరామ్ ఎంత వరకు ఆకట్టుకుంటాడో చూడాలి.

తమిళంలో సత్తా చాటిన తెలుగు సినిమాలు … టాప్ 10 లిస్ట్ ఇదే ..!

Most Recommended Video

బ్రహ్మానందం కామెడీతో హిట్టైన 10 సినిమాల లిస్ట్..!
సెలబ్రిటీ కపుల్స్ నయా ట్రెండ్.. ‘సరోగసీ’..!
చైసామ్, ధనుష్- ఐస్ లు మాత్రమే కాదు సెలబ్రిటీల విడాకుల లిస్ట్ ఇంకా ఉంది..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus