తెలుగు సినిమా ఇండస్ట్రీలో ప్రేమ కథ చిత్రాలను చేయడంలో తనకంటూ సెపరేట్ రూట్ ఏర్పరచుకున్నటువంటి డైరెక్టర్ తేజ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. దర్శకుడిగా ఇండస్ట్రీలో ఎంతో మంచి సక్సెస్ అందుకొని ఎన్నో అద్భుతమైన ప్రేమ కథ చిత్రాలను ప్రేక్షకులకు పరిచయం చేసిన తేజ గత కొంతకాలంగా ఇండస్ట్రీకి దూరంగా ఉంటున్నారు. అయితే తాజాగా ఈయన అహింస సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. దగ్గుబాటి అభిరామ్ హీరోగా పరిచయమవుతూ అహింస అనే సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.
ఈ సినిమా జూన్ రెండవ తేదీ విడుదల కానున్న నేపథ్యంలో పెద్ద ఎత్తున ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు.ఈ ప్రమోషన్ కార్యక్రమాలలో ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నటువంటి తేజ తన డైరెక్షన్లో వచ్చిన సినిమాలు కొన్నిసార్లు ఫెయిల్ అవ్వడానికి గల కారణాలను తెలియజేశారు. సాధారణంగా సినిమాలు ఇండస్ట్రీలో సక్సెస్ ఫెయిల్యూర్ అవ్వడం అనేది సర్వసాధారణంగా జరిగే అంశం అయితే తేజ సినిమాలు మాత్రం ఫెయిల్యూర్ అవడానికి గల కారణాలు ఏంటి అనే విషయాలను ఈయన తెలియజేశారు.
ఈ సందర్భంగా తేజ (Teja) మాట్లాడుతూ తాను ఒక ఎమోషనల్ పర్సన్ అని తెలియజేశారు.తాను ఒక విషయం గురించి బాధపడ్డాను అంటే తొందరగా ఆ సినిమా నుంచి తాను డిస్ కనెక్ట్ అవుతానని తిరిగి సినిమా పై మనసు పెట్టలేనని తెలియజేశారు. ఇక ఆ సినిమాను ఒప్పుకున్న తర్వాత టీం కోసం సినిమా పూర్తి చేయాలి కాబట్టి చేస్తానే తప్ప మనస్పూర్తిగా ఆ సినిమాపై దృష్టి పెట్టలేనని అందుకే కొన్నిసార్లు సినిమా ఫెయిల్యూర్ అవుతుందని ఈ సందర్భంగా తేజ చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. చాలా రోజుల తర్వాత ఈయన అహింస సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. మరి ఈ సినిమా ప్రేక్షకులను ఎలా ఆకట్టుకుంటుందో తెలియాల్సి ఉంది.