టాలీవుడ్ ప్రముఖ డైరెక్టర్లలో ఒకరైన తేజ డైరెక్షన్ లో తెరకెక్కిన సినిమాలలో కెరీర్ తొలినాళ్లలో తెరకెక్కిన సినిమాలు సక్సెస్ సాధించాయి. అయితే ఈ మధ్య కాలంలో తేజ డైరెక్షన్ లో వచ్చిన సినిమాలలో చాలా సినిమాలు ఆశించిన ఫలితాలను అందుకోలేదు. అతి త్వరలో తేజ డైరెక్షన్ లో తెరకెక్కిన అహింస మూవీ థియేటర్లలో రిలీజ్ కానుంది. ఈ సినిమాతో తేజ సక్సెస్ ట్రాక్ లోకి వస్తారని అభిమానులు భావిస్తున్నారు. అహింస సినిమాలో అభిరామ్ దగ్గుబాటి హీరోగా నటించడం గమనార్హం.
తాజాగా ఒక యూట్యూబ్ ఛానల్ కు ఇంటర్వ్యూ ఇచ్చిన (Teja) తేజ షాకింగ్ విషయాలను వెల్లడించారు. కంటెంట్ కు అనుగుణంగా సినిమాలను తెరకెక్కిస్తే సినిమాలు కచ్చితంగా సక్సెస్ సాధించే అవకాశం అయితే ఉందని తేజ చెప్పుకొచ్చారు. తప్పుల నుంచే తాను ఎన్నో విషయాలను నేర్చుకున్నానని ఆయన కామెంట్లు చేశారు. నాకు జరిగిన అవమానాలను, నేను చేసిన తప్పులను ఎప్పటికీ గుర్తు పెట్టుకుంటానని ఆయన పేర్కొన్నారు.
ఆ తప్పులను మళ్లీ చేయకూడదని నిర్ణయించుకున్నానని తేజ వెల్లడించారు. గతంలో ఇంటిపై రుణం తీసుకున్నానని ఆ సమయంలో మధ్యలో నాలుగు సంవత్సరాల పాటు సినిమాలు చేయలేదని ఆయన కామెంట్లు చేశారు. ఇంటి లోన్ చెల్లించకపోవడంతో ఇంటిని జప్తు చేస్తున్నట్టు గోడకు నోటీస్ అంటించారని తేజ చెప్పుకొచ్చారు. ఆ తర్వాత బ్యాంక్ కు మొత్తం డబ్బులను చెల్లించడం జరిగిందని తేజ కామెంట్లు చేశారు.
లైఫ్ లో మళ్లీ లోన్ తీసుకోకూడదని నిర్ణయం తీసుకున్నానని ఆయన కామెంట్లు చేశారు. బ్యాంక్ వాళ్లు రాసిన నోటీస్ ను నేను తొలగించలేదని ఆయన చెప్పుకొచ్చారు. మధ్యలో నేను చేసిన కొన్ని సినిమాలు ఫ్లాప్ అయ్యాయని తేజ అన్నారు. సినిమా రిజల్ట్ ముందుగానే తెలిసిపోతుందని ఆయన చెప్పుకొచ్చారు. ఈ రీజన్ వల్లే ఏ సినిమాపై ఆశలు పెట్టుకోనని ఆయన తెలిపారు.