నందమూరి కళ్యాణ్ రామ్ ప్రస్తుతం తన సినిమాలో జోరును పెంచేశారు. ఈయన వరుస సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వస్తూ పెద్ద ఎత్తున ప్రేక్షకులను సందడి చేస్తున్నారు. చాలా కాలం తర్వాత బింబిసారా వంటి సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చినటువంటి కళ్యాణ్ రామ్ ఈ సినిమాతో బ్లాక్ బస్టర్ అందుకున్నారు. ఇందులో ద్విపాత్రాభినయంలో కళ్యాణ్ రామ్ నటించిన మెప్పించారు. ఈ సినిమా ద్వారా ఎంతో మంచి సక్సెస్ అందుకున్నటువంటి కళ్యాణ్ రామ్ ఈ సినిమాకు వశిష్ట అనే నూతన దర్శకుడిని పరిచయం చేశారు.
ఇలా మొదటి సినిమాతోనే డైరెక్టర్ వశిష్ట కూడా ఎంతో మంచి సక్సెస్ అందుకోవడంతో ఈయనకు కూడా తెలుగులో అవకాశాలు వస్తున్నాయని తెలుస్తోంది. ఈ సినిమా తర్వాత కళ్యాణ్ రామ్ అమిగోస్ అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ సినిమా ఊహించిన స్థాయిలో సక్సెస్ కాలేక పోయింది. ప్రస్తుతం ఈయన డెవిల్ అనే మరో సినిమాలో కూడా నటిస్తున్నారు.ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.
ఇదిలా ఉండగా కళ్యాణ్ రామ్ బ్లాక్ బాస్టర్ అందుకున్నటువంటి (Bimbisara 2) బింబిసార సినిమాకు సీక్వెల్ చిత్రం రాబోతుందని ప్రకటించారు. దీంతో ఈ సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఈ సినిమాని భారీ బడ్జెట్ సినిమాగా నిర్మించడానికి సిద్ధమయ్యారని తెలుస్తుంది. బింబిసారా సినిమాని కళ్యాణ్ రామ్ తన సొంత నిర్మాణ సంస్థలో నిర్మించిన విషయం మనకు తెలిసిందే. అయితే ఈ సినిమా సీక్వెల్ చిత్రాన్ని అత్యంత భారీ బడ్జెట్ సినిమాకు ప్రేక్షకుల ముందు తీసుకురావడానికి సిద్ధమయ్యారు.
తాజాగా ఈ సినిమాకు సంబంధించి ఓ వార్త వైరల్ గా మారింది. ఈ సినిమా నుంచి డైరెక్టర్ వశిష్ట తప్పుకున్నారని తెలుస్తోంది. అయితే కళ్యాణ్ రామ్ తో విభేదాల కారణంగానే ఈయన తప్పుకున్నారని తెలుస్తుంది. కానీ ఈయన మాత్రం మెగాస్టార్ చిరంజీవితో ఓ సినిమాకు కమిట్ అయ్యారని ఈ సినిమా షూటింగ్ కారణంగానే బింబిసారా సీక్వెల్ నుంచి తప్పుకున్నారంటూ వార్తలు వస్తున్నాయి. మరి ఇందులో ఎంతవరకు నిజం ఉందో తెలియాల్సి ఉంది.