ఈరోజుల్లో సోషల్ మీడియా వల్ల పాజిటివీ అనేది ఎంత పర్సంటేజ్ ఉందో చెప్పలేం కానీ నెగిటివిటీ మాత్రం చెప్పలేని విధంగా ఉంది.. ముఖ్యంగా సెలబ్రిటీలు, సామాన్యుల మధ్య దూరం అనేది తగ్గిపోయింది.. దీంతో వారి పర్సనల్ లైఫ్ గురించి ఏదో తెలిసిన మనుషులు, ఫ్రెండ్స్‌లా కామెంట్స్ చేసేస్తున్నారు. ఇంకా హీరోయిన్ల పిక్స్ మార్ఫింగ్ చేయడం అనేది ఆగడం లేదంటే.. ఇక అలాంటి వాళ్ల గురించి ఏం చెప్పలేం.. నెటిజన్ల నుండి ఇలాంటి ఓ ఊహించని అనుభవం..
కొన్ని షాకింగ్ ఇన్సిడెంట్స్ ఎదురయ్యాయి టాలీవుడ్ యంగ్ డైరెక్టర్ వివేక్ ఆత్రేయకి.. తనకెదురైన చేదు అనుభవాల గురించి ఇలా చెప్పుకొచ్చారాయన.. ‘‘కోవిడ్ టైంలో మా ఫ్రెండ్ వాళ్ల నాన్నగారు అనారోగ్యానికి గురయ్యారు.. దీంతో ఆయనకు బ్లడ్ అవసరమైంది.. ఆయన బ్లడ్ గ్రూప్‌కి సరిపడే డోనర్ కోసం చాలా ట్రై చేశాం.. నా నంబర్ యాడ్ చేసి చాలా మందికి మెసేజెస్ పంపాను.. ఈ విషయం తెలిసి అనుష్క గారు మాకు హెల్ప్ చేయడానికి నా మెసేజ్ ఆమె సోషల్ మీడియాలో షేర్ చేశారు..
కట్ చేస్తే.. ఆ పోస్ట్‌లో ఉన్న ఫోన్ నంబర్ నాదే అనుకుని చాలామంది కాల్స్ చేశారు.. ఒకరు వీడియో కాల్ చేస్తే.. మరొకరైతే షర్ట్ లేకుండా ఫోటోలు పంపారు.. బాబోయ్, ఆ దారుణాలను వివరించలేను.. నటీమణుల జీవితం ఇంత కష్టంగా ఉంటుందా? అని ఆరోజు షాకయ్యాను.. కొద్ది రోజుల తర్వాత ఆ నంబర్ బ్లాక్ చేసేశాను’’ అని చెప్పుకొచ్చారు..‘మెంటల్ మదిలో’, ‘బ్రోచేవారెవరురా’ వంటి విభిన్నకథా చిత్రాలతో ప్రేక్షకులను ఆకట్టుకున్న వివేక్..
డిఫరెంట్ కథాంశంతో నాని హీరోగా చేసిన.. ‘అంటే.. సుందరానికీ’ అనుకున్నంతగా ఆడలేదు.. నిడివి విషయంలో ముందే సందేహం ఉన్నా సీన్ల మధ్య సింక్ పోతుందని ఎడిట్ చెయ్యలేదని.. సినిమాకి ఎక్కువగా దగ్గర కాకుడదని ఈ సినిమాతోనే నేర్చుకున్నా.. ఎందుకంటే ఈ మూవీ రిజల్ట్ నన్నెంతో బాధ పెట్టింది అని ఆవేదన వ్యక్తం చేశారు..
సార్ సినిమా రివ్యూ & రేటింగ్!
‘గజిని’ మూవీ మిస్ చేసుకున్న హీరోలు ఎవరంటే?
టాప్ 10 రెమ్యూనరేషన్ తెలుగు హీరోలు…ఎంతో తెలుసా ?
కళ్యాణ్ రామ్ నటించిన గత 10 సినిమాల బాక్సాఫీస్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందంటే?