దువ్వాడ జగన్నాధమ్ ఫస్ట్ డే కలక్షన్స్ | అల్లు అర్జున్ | పూజ హెగ్డే
- June 24, 2017 / 07:58 AM ISTByFilmy Focus
హరీష్ శంకర్ దర్శకత్వంలో అల్లు అర్జున్ నటించిన చిత్రం దువ్వాడ జగన్నాధమ్ నిన్న రిలీజ్ అయి మిశ్రమ స్పందన అందుకుంది. అయినప్పటికీ విడుదలయిన అన్ని థియేటర్లలో హౌస్ ఫుల్ కలక్షన్స్ రాబట్టింది. బన్నీ గత చిత్రం సరైనోడు ఫస్ట్ డే రికార్డ్ ని బీట్ చేసింది. తెలుగు రాష్ట్రాల్లో సరైనోడు ఫస్ట్ డే 14 .40 కోట్లు రాబట్టగా, డీజే ఫస్ట్ డే 25 కోట్ల గ్రాస్ వసూలు చేసింది. షేర్ 19 కోట్లు వచ్చి డిస్ట్రిబ్యూటర్లకు సంతోషం కలిగించింది. ఈ చిత్రం థియేటర్ రైట్స్ ని 60.10 కోట్లకు కొనుగోలు చేశారు. ఈ దూకుడు ఇలాగే కొనసాగితే సోమవారం నాటికీ పెట్టుబడి తిరిగి వచ్చేస్తుందని ట్రేడ్ వర్గాల వారు అంచనా వేస్తున్నారు. ఇక ఓవర్సీస్ లోను తొలిరోజు 2 .25 కోట్లు వసూలు చేసి అల్లు అర్జున్ సత్తాని చాటింది.
తెలుగు రాష్ట్రాల్లో ఏరియాల వారీగా కలక్షన్స్(షేర్) వివరాలు..
ఏరియా వసూళ్లు (కోట్లు)
నైజాం 4.95
సీడెడ్ 2.70
వైజాగ్ 1.94
ఈస్ట్ 2.55
వెస్ట్ 2.83
కృష్ణ 1.03
గుంటూరు 2.26
నెల్లూరు 0.54
మొత్తం 19
Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

















