దేవరకొండ బ్రదర్స్‌లో ఒకరు సరైన విజయం కోసం ఎదురుచూస్తుండగా.. మరొకరు తిరిగి విన్నింగ్ ట్రాక్ ఎక్కడానికి ఎదురుచూస్తున్నారు. వారెవరు, ఎవరికి ఎలాంటి విజయం కావాలి అనేది ఆఖరున చూద్దాం. ఇప్పుడైతే ఇద్దరి క్రష్ గురించి తెలుసుకుందాం. అందులో తెలుసుకోవడానికి ఏముంది విజయ్ దేవరకొండ క్రష్ తెలుసుకదా అనుకుంటున్నారా. మరి రెండో దేవరకొండ అనంద్ క్రష్ గురించి తెలుసుకోవాలిగా. ఇటీవల ఆయన మనసును క్రష్ చేసిన హీరోయిన్ గురించి చెప్పాడు ఆనంద్.
రోహన్ రాయ్, అరుణ్ దేవ్ ప్రధాన పాత్రల్లో.. శ్రీకర్ నాయన్ తెరకెక్కించిన చిత్రం ‘సమ్మర్ హాలీడేస్’. ఈ సినిమాలోని ‘క్రష్..’ అనే పాట లాంచ్ ఈవెంట్ ఇటీవల జరిగింది. ఆ ఈవెంట్‌కు యువ దర్శకుడు ఆదిత్య హాసన్, హీరో ఆనంద్ దేవరకొండ, నిర్మాత ఎస్‌కేఎన్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ క్రమంలోనే ‘మీ ఫస్ట్ క్రష్ ఎవరు?’ అనే టాపిక్ మీద చర్చ జరిగింది. అలా ఆ టాపిక్ ఆనంద్ దేవరకొండ దగ్గరకు వచ్చేసరికి ఆసక్తికర సమాధానం వచ్చింది.
తాను బాయ్స్ బోర్డింగ్ స్కూల్‌లోనే చదివానని.. అందుకే క్రష్ అంటూ ఎవరూ లేరని క్లారిటీ ఇచ్చేశారు ఆనంద్. ఇక సమ్మర్ హాలీడేస్‌లో ఇంటికి వెళ్లినా విజయ్‌తో ఎక్కువగా క్రికెట్ ఆడేవాడినని నాటి రోజులు గుర్తు చేసుకున్నాడు. అయితే సినిమాలు చూసినప్పుడు హీరోయిన్లపై క్రష్ ఉండేదని. అలా ‘మురారీ’ సినిమా చూసినప్పుడు సొనాలీ బింద్రేపై క్రష్ పుట్టింది అని అసలు విషయం చెప్పాడు ఆనంద్. మరి ఇప్పుడు ఎవరైనా ఉన్నారా అని అడిగితే లేదు అని చెప్పాడు. అవునో కాదో అతనికే తెలియాలి మరి.
దాంతో మరో ఆసక్తికర కామెంట్ కూడా చేశాడు ఆనంద్. ‘బేబీ’ సినిమా వచ్చి మూడు సంవత్సరాలు అవుతోంది. ఈ మూడేళ్లలో నాకంటే రోహన్ (సమ్మర్ హాలీడేస్ హీరో) సినిమాలే ఎక్కువ వచ్చాయి అని నవ్వేశాడు. ఆనంద్ నటిస్తున్న ‘ఎపిక్’ సినిమా త్వరలో విడుదల కానుంది. ఇందులో ‘బేబీ’ హీరోయిన్ వైష్ణవి చైతన్య కథానాయిక. ‘90s’ వెబ్ సిరీస్ టచ్‌తో ఈ సినిమా రూపొందుతోంది.