Chandra Mohan: హైదరాబాదులో చంద్రమోహన్ కి ఎన్ని ఇల్లులు ఉన్నాయో తెలుసా?

  • November 14, 2023 / 09:24 AM IST

సీనియర్ నటుడు చంద్రమోహన్ మరణ వార్త ఇండస్ట్రీకి తీరని లోటు అని చెప్పాలి శనివారం ఉదయం మరణించినటువంటి ఈయన మరణం పట్ల ఎంతో మంది సినీ సెలబ్రిటీలు స్పందిస్తూ నివాళులు అర్పిస్తున్నారు. ఇక ఈయన పెద్ద కుమార్తె అమెరికాలో ఉన్న నేపథ్యంలో తను వచ్చేవరకు ఈయన అంత్యక్రియలో నిర్వర్తించడం లేదని తెలుస్తుంది. చంద్రమోహన్ అంత్యక్రియలు సోమవారం జరగబోతున్నాయని కుటుంబ సభ్యులు వెల్లడించారు. ఇక చంద్రమోహన్ మరణించడంతో ఆయనకు సంబంధించి ఎన్నో వార్తల సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

ఈ క్రమంలోనే ఈయన ఆస్తుల గురించి కూడా వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. చంద్రమోహన్ పెద్ద ఎత్తున ఇండస్ట్రీలో కొనసాగే సమయంలో భూములను కొనుగోలు చేశారు. అయితే అప్పట్లో భూముల కబ్జా ఎక్కువగా ఉన్న నేపథ్యంలో తన భూములు కూడా ఎక్కడ కబ్జా చేస్తారనీ భయపడి వాటిని అమ్మేసుకున్నారు. ఇలా అప్పట్లో కొన్ని ఎకరాలపాటు భూమిని అమ్ముకున్నటువంటి (Chandra Mohan0 చంద్రమోహన్ ఒక ఇంటర్వ్యూలో పాల్గొని చాలా బాధపడ్డారు.

ఆ భూములన్ని ఉండి ఉంటే వందల కోట్ల ఆస్తి ఉండేదని ఈయన తెలియజేశారు. అయితే భూములన్ని అమ్ముకున్న కానీ ఈయనకు హైదరాబాద్లో మాత్రం చాలా ఇల్లులు ఉన్నాయని తెలుస్తుంది. హైదరాబాదులో ఈయన పలు నగరాలలో పెద్దపెద్ద ఇండ్లను కొనుగోలు చేశారని తెలుస్తోంది. కేవలం చంద్రమోహన్ కు హైదరాబాదులో ఉన్నటువంటి ఇళ్ల ద్వారా నెలకు దాదాపు పది లక్షల రూపాయల వరకు అద్దె వచ్చేదంటూ ఒక వార్త వైరల్ గా మారింది.

ఇలా నెలకు 10 లక్షల రూపాయలు ఇంటి అద్దె మాత్రమే వస్తుంది అంటే హైదరాబాదులో ఈయనకు ఎన్ని ఇల్లులు ఉన్నాయో మనం అర్థం చేసుకోవచ్చు. ఇక చంద్రమోహన్ కి కుమారులు లేరు కానీ ఇద్దరు కుమార్తెలు ఉన్నారు వీరిద్దరూ కూడా వృత్తిపరంగా డాక్టర్లు కావటం విశేషం. ఇక వీరు పెళ్లిళ్లు చేసుకుని వారి జీవితంలో ఎంతో మంచిగా స్థిరపడ్డారు.

మా ఊరి పొలిమేర 2 సినిమా రివ్యూ & రేటింగ్!

కీడా కోలా సినిమా రివ్యూ & రేటింగ్!
నరకాసుర సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus