Vijay, Rashmika: ఇంస్టాగ్రామ్ ద్వారా ఈ సెలబ్రెటీల సంపాదన ఎంతో తెలుసా?

  • January 31, 2024 / 02:35 PM IST

సోషల్ మీడియా ఎంతో అభివృద్ధి చెందిన తర్వాత సెలబ్రేటీలందరూ కూడా సోషల్ మీడియా వేదికగా ఎంతో యాక్టివ్ గా ఉంటూ వారికి సంబంధించిన అన్ని విషయాలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ భారీ స్థాయిలో అభిమానులను సొంతం చేసుకుంటున్నారు. ఇలా ఎంతో మంది సెలబ్రిటీలు మిలియన్ సంఖ్యలో ఫాలోవర్స్ ని కలిగి ఉన్న సంగతి మనకు తెలిసిందే. అయితే వీళ్ళు సోషల్ మీడియాలో వారికి సంబంధించిన అప్డేట్స్ ఇవ్వడమే కాకుండా నెలకు లక్షల్లో ఆదాయం పొందుతున్నారని కూడా తెలుస్తుంది.

ఈ క్రమంలోనే మన టాలీవుడ్ సెలబ్రిటీలు ఇంస్టాగ్రామ్ ద్వారా ఒక్క పోస్ట్ షేర్ చేస్తూ ఎంత మొత్తంలో సంపాదిస్తున్నారనే విషయానికి వస్తే.. నేషనల్ క్రష్ గా గుర్తింపు పొందినటువంటి రష్మిక ఇంస్టాగ్రామ్ లో ఒక్క పోస్ట్ చేస్తే 20 నుంచి 30 లక్షల వరకు రెమ్యూనరేషన్ తీసుకుంటారట. మహేష్ బాబు: మహేష్ బాబుకు సౌత్ ఇండస్ట్రీలో ఉన్నటువంటి క్రేజ్ మామూలుగా లేదని చెప్పాలి.

ఈయన సినిమాలు మాత్రమే కాకుండా అనేక వ్యాపారాలను ఎండార్స్ చేస్తూ సోషల్ మీడియాలో ప్రచారం చేస్తుంటాడు. ఒక్కో పోస్టుకు రూ.1-2 కోట్లు డిమాండ్ చేస్తున్నట్లు సమాచారం. విజయ్ దేవరకొండ: రౌడీ హీరోగా ఎంతో పేరు ప్రఖ్యాతలను సంపాదించుకున్నటువంటి ఈయన (Vijay) ఒకవైపు సినిమాలలో నటిస్తూనే మరోవైపు వ్యాపార రంగంలో కూడా దూసుకుపోతున్నారు.

ఈయన ఇంస్టాగ్రామ్ ద్వారా కోటి రూపాయల వరకు ఆదాయం పొందుతున్నారని సమాచారం. ఇక పూజ హెగ్డే ఒక్క పోస్టుకు 30 లక్షలు తీసుకోగా సమంత కూడా అదే స్థాయిలోనే తీసుకుంటున్నారు. ఇక కాజల్ అగర్వాల్ ఒక్కో పోస్ట్ చేస్తే 50 నుంచి కోటి రూపాయల వరకు రెమ్యూనరేషన్ తీసుకుంటున్నారు.

‘గుంటూరు కారం’ లో ఆకట్టుకునే డైలాగులు ఇవే.!

‘గుంటూరు కారం’ తో పాటు సంక్రాంతి సీజన్ వల్ల సేఫ్ అయిన 10 సినిమాల లిస్ట్.!
2023లో అభినయంతో ఆకట్టుకున్న అందాల భామలు.!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus