సినీ పరిశ్రమలో హీరోయిన్ గా రాణించాలని ఎన్నో ఆశలతో ఇండస్ట్రీలో అడుగుపెట్టిన కొంతమంది నటీమణులు.. తర్వాత చాలా ఇబ్బందులు పడి తొందరగానే ఫేడౌట్ అయిపోయారు. అయితే ఇంకొంతమంది నటీమణులు సినిమాల్లో నటిస్తూనే..మరోపక్క డబ్బు పై ఆశతో శరీరాన్ని కూడా చాలా సార్లు తాకట్టుపెట్టిన సందర్భాలు ఉన్నాయి.అలాంటి భామల్లో భువనేశ్వరి ఒకరు. ఆంధ్రప్రదేశ్ లోని చిత్తూరు కు చెందిన ఈమె.. సినిమాల పై ఇష్టంతో మోడలింగ్ రంగంలోకి అడుగుపెట్టింది. అక్కడ ఓ హీరో మరియు అతని స్నేహితుడు అయిన ప్రొడ్యూసర్ భువనేశ్వరిని చూసి..
ఈమె అందానికి మంత్రముగ్దులు అయిపోయారు. నిర్మాత సంగతి ఏమో కానీ ఆ హీరోగారైతే వెంటనే ఈమెతో పరిచయం పెంచుకోవడం.. సినిమాల్లో ఛాన్స్ ఇప్పిస్తానని చెప్పి ప్రేమ అనే వల వేయడం జరిగింది. అటు తర్వాత ఈమె దగ్గర ఉన్న అందాన్ని మొత్తం దోచుకుని.. మోజు తీరిపోయాక ఈమెను వదిలించుకున్నాడు. ఈమెకు ఎటువంటి సినిమా ఛాన్స్ లు ఇవ్వలేదు. దీంతో భువనేశ్వరి తన అందాన్ని వలవేసి సినిమాల్లో రెండు, మూడు నిమిషాల నిడివి గల పాత్రలు పట్టేది. ఆ పాత్రలకు గాను ఈమెకు వచ్చే డబ్బు.. ఈమెకు తృప్తినివ్వలేదు.
దీంతో మరోపక్క సీరియల్స్ లో నటిస్తూ వ్యభిచారంలోకి దిగింది. సొంతంగా ఓ ఇల్లు కూడా కొనుక్కునే రేంజ్ కు వెళ్ళింది. అప్పట్లో చెన్నైలో ఉన్న ఈమె ఇంటి ముందు ట్రాఫిక్ జామ్ అయ్యేదట. అంతలా పెద్ద వాళ్ళ కార్లు వచ్చి ఆగేవట. దీంతో కొంతమంది పోలీస్ కంప్లైంట్ ఇవ్వడం.. రైడ్ చేసినప్పుడు ఈమె పట్టుబడటం జరిగింది. అయితే ఈమెతో పాటు పెద్ద పలుకుబడి ఉన్న వాళ్ళు కూడా దొరకడంతో అరెస్ట్ అయినప్పటికీ ఈమె తొందరగానే బయటకొచ్చేసింది.
కొన్నాళ్ల తర్వాత ఈమె ఓ ఫైవ్ స్టార్ హోటల్లో కూడా ఓ సెలబ్రిటీతో వ్యభిచారం చేస్తూ దొరికింది. అప్పుడు కూడా ఆ సెలబ్రిటీ రిఫరెన్స్ తో బయటకు వచ్చింది. కానీ ఈమె మూడోసారి కూడా పట్టుబడినప్పుడు న్యాయస్థానంలో ఈ పని చాలా మంది చేస్తున్నారు అంటూ డిఫెండ్ చేసుకోవడానికి షాకింగ్ కామెంట్స్ చేసింది. ఆ తర్వాత ఓ నిర్మాత దగ్గర సీరియల్ లో నటిస్తాను అని కొంత డబ్బు కూడా తీసుకుని ఎగ్గొట్టిందని.. మరో కేసులో ఇరుక్కోవడంతో ఈమె సినీ కెరీర్ కు ఫుల్ స్టాప్ పడినట్టు అయ్యింది.