Sachin Tendulkar: ఇప్పుడు ఈ బుడ్డోడు టాలీవుడ్ లో పెద్ద స్టార్ హీరో అని తెలుసా..!

పై ఫోటోలో ఉన్న పిల్లాడిని గుర్తుప‌ట్టారా? క్రికెట్ దేవుడు స‌చిన్ టెండూల్క‌ర్ ప్రేమ‌గా ప‌ట్టుకున్న ఆ కుర్రాడు ఇప్పుడు టాలీవుడ్‌లో హీరోగా రాణిస్తున్నాడు. ఇత‌డు హీరోగా న‌టించిన తొలి సినిమాకే ఉత్త‌మ న‌టుడిగా సైమా అవార్డు సైతం అందుకున్నాడు. శ్రీలీల‌తోనూ ఓ సినిమా చేశాడు. ఇత‌డి తండ్రిటాలీవుడ్‌లో సీనియ‌ర్ న‌టుడు.. ఈపాటికే ఇత‌డెవ‌రో గుర్తుప‌ట్టే ఉంటారు. స‌చిన్ టెండూల్క‌ర్‌తో ఉన్న ఆ పిల్లాడు మ‌రెవ‌రో కాదు.. సీనియ‌ర్ న‌టుడు శ్రీకాంత్ త‌న‌యుడు, యంగ్ హీరో రోష‌న్ మేక‌.

శ్రీకాంత్ ఎన్నో అద్భుత సినిమాల్లో న‌టించి తెలుగు ప్రేక్ష‌కుల‌కు ద‌గ్గ‌ర‌య్యాడు. తండ్రిలోని న‌ట‌న‌ను పుణికి పుచ్చుకున్న రోష‌న్ రుద్ర‌మ‌దేవి సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్‌గా న‌టించాడు. నిర్మ‌ల కాన్వెంట్‌తో హీరోగా మారాడు. ఈ సినిమాకు అద్భుత‌మైన స్పంద‌న ల‌భించింది. ఈ చిత్రం రిలీజైన ఐదేళ్ల త‌ర్వాత పెళ్లి సంద‌D మూవీతో మ‌రోసారి ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చాడు. ఇందులో శ్రీలీల క‌థానాయిక‌గా న‌టించింది. ఈ సినిమాకు పాజిటివ్ స్పంద‌న ల‌భించింది. ప్ర‌స్తుతం రోష‌న్‌.వృషభ సినిమా చేస్తున్నాడు. ది వారియ‌ర్ అరైజ్ అనేది ఉప‌శీర్షిక‌.

ఇందులో మోహ‌న్‌లాల్ ప్ర‌ధాన పాత్ర‌లో న‌టిస్తున్నాడు. తండ్రీకొడుకుల మ‌ధ్య సాగే ఎమోష‌న‌ల్ యాక్ష‌న్ డ్రామాగా ఈ చిత్రం తెర‌కెక్కుతోంది. జహ్రా ఖాన్, శనయ కపూర్‌ హీరోయిన్లుగా నటిస్తున్నారు. నంద కిషోర్‌ దర్శకత్వం వ‌హిస్తున్న ఈ చిత్రాన్ని అభిషేక్‌ వ్యాస్, విశాల్‌ గుర్నాని, జుహి పరేఖ్‌ మెహతా, శ్యామ్‌ సుందర్, ఏక్తా కపూర్, శోభా కపూర్, వరుణ్‌ మథూర్, సౌరభ్‌ మిశ్రా నిర్మిస్తున్నారు. తెలుగు, మలయాళ భాషల్లో రూపొందుతోన్న ఈ చిత్రం హిందీ, కన్నడ, తమిళ భాషల్లో 2024లో రిలీజ్‌ కానుంది.

మా ఊరి పొలిమేర 2 సినిమా రివ్యూ & రేటింగ్!

కీడా కోలా సినిమా రివ్యూ & రేటింగ్!
నరకాసుర సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus