రజినీకాంత్ మనవడిగా నటించిన ఈ బుడ్డోడి తండ్రి ఎవరో తెలిస్తే ఆశ్చర్యపోతారు!

సూపర్ స్టార్ రజినీకాంత్ హీరో గా నటించిన లేటెస్ట్ చిత్రం ‘జైలర్’ బాక్స్ ఆఫీస్ వద్ద ఎంతటి సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ హిట్ అయ్యిందో మన అందరికీ తెలిసిందే. విడుదలకు ముందే భారీ అంచనాలను నెలకొల్పిన ఈ సినిమా విడుదల తర్వాత మొదటి ఆట నుండే బ్లాక్ బస్టర్ టాక్ ని తెచ్చుకుంది. రజినీకాంత్ కి గడిచిన దశాబ్ద కాలం లో ఇంత క్లీన్ పాజిటివ్ టాక్ మరో సినిమాకి రాలేదు.

రాక రాక సూపర్ హిట్ టాక్ వచ్చేసరికి బాక్స్ ఆఫీస్ రికార్డ్స్ వేట మాములు రేంజ్ లో జరగలేదు. కేవలం తమిళం లో మాత్రం కాదు, తెలుగు లో కూడా ఈ సినిమా రజినీకాంత్ కెరీర్ లో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ గా నిల్చింది. మొత్తం మీద ప్రపంచ వ్యాప్తంగా 600 కోట్ల రూపాయిల గ్రాస్ ని కొల్లగొట్టిన ఈ సినిమా, ఇప్పటికీ థియేటర్స్ లో విజయవంతంగా ఆడుతూనే ఉంది.

ఇకపోతే ఈ సినిమా లో రజినీకాంత్ మనవడిగా నటించిన చిన్న కుర్రాడిని అంత తేలికగా మనం మరచిపోలేము. క్యూట్ గా మాట్లాడుతూ అందరి దృష్టిని ఆకర్షించాడు ఈ బుడతడు. ఇంతకు ముందు ఈ బుడ్డోడు కార్తీ హీరో గా నటించిన ‘సర్దార్’ చిత్రం లో కూడా నటించాడు. సినిమాల్లోకి రాకముందే ఈ బుడ్డోడు యూట్యూబ్ స్టార్. ఇతనికి ‘రీతూ రాక్స్’ అని ఒక యూట్యూబ్ ఛానెల్ ఉంది. అందులో దాదాపుగా 24 లక్షల మంది ఉన్నారు.

ఈ ఛానల్ లో ఇతను కొత్త కొత్త కాన్సెప్ట్ వీడియోస్ చేస్తూ సెలబ్రిటీ అయ్యాడు. అలా వచ్చిన సెలబ్రిటీ స్టేటస్ తోనే సినిమాల్లో అవకాశాలు సంపాదించాడు. అయితే ఇతను ‘జైలర్‘ డైరెక్టర్ నెల్సన్ దిలీప్ కుమార్ కి బంధువు అవుతాడు. నెల్సన్ కజిన్ కొడుకు అట, ఈ విషయం స్వయంగా నెల్సన్ రీసెంట్ గా ఇచ్చిన ఒక తమిళ ఇంటర్వ్యూ లో చెప్పుకొచ్చాడు. చిచ్చర పిడుగు లాగ దూసుకుపోతున్న ఈ బుడ్డోడు, రాబొయ్యే రోజుల్లో ఏ రేంజ్ కి వేళ్తాడో చూడాలి.

‘బిగ్ బాస్ 7’ కంటెస్టెంట్ ప్రియాంక జైన్ గురించి 10 ఆసక్తికర విషయాలు..!

‘బిగ్ బాస్ 7’ కంటెస్టెంట్ దామిని భట్ల గురించి 10 ఆసక్తికర విషయాలు!
‘బిగ్ బాస్ 7’ 14 మంది కంటెస్టెంట్స్ పారితోషికాల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus