సాయి పల్లవితో పాటు టాలీవుడ్ లో యాక్టర్లుగా కొనసాగుతున్న డాక్టర్లు వీళ్ళే..!

  • July 5, 2022 / 08:19 PM IST

డాక్టర్ల గురించి మన సినిమాల్లో చాలా గొప్పగా కూడా చెప్పారు, కమర్షియల్ అన్నట్టు కూడా చూపించారు. నిజ జీవితంలో డాక్టర్ అంటే ప్రత్యక్ష దైవం అంటుంటారు. తల్లిదండ్రులు, గురువులు మాత్రమే కాదు డాక్టర్ కూడా ప్రత్యక్ష దైవమే.కరోనా టైంలో ఈ విషయం అందరికీ బాగా తెలిసింది. సాధారణంగా డాక్టర్ అవ్వాలని ఎక్కువ మంది యువత అనుకోరు. ఎందుకంటే డాక్టర్ కోర్స్ ఏళ్లకు ఏళ్లు చదువుతూ ఉండాలి. సగం జీవితం ల్యాబ్ లోనే గడిచిపోతుంది అని వెనకడుగు వేస్తారు. పెద్దవాళ్ళు కూడా డాక్టర్ చదువుతాను అంటే ఎక్కువగా ఎంకరేజ్ చేయరు. వాళ్ళది కూడా సేమ్ స్ట్రాటజీ. అయితే డాక్టర్ అయిన వాళ్ళు ఆ వృత్తిని వదిలి ఇంకో ప్రపంచం వెతుక్కోలేరు. తమ వృత్తి మాత్రమే ప్రపంచం అనుకుంటారు. వాళ్ళకి అంత టైం కూడా ఉండకపోవచ్చు.

అయితే టాలీవుడ్లో కొంతమంది యాక్టర్స్ గా మారిన డాక్టర్స్ ఉన్నారు. ఓ పక్క డాక్టర్లుగా కొనసాగుతూనే మరో పక్క నటనని కూడా కొనసాగిస్తున్నారు. పాషన్ ను ప్రొఫెషన్ ను సమాంతరంగా మేనేజ్ చేయడం అంటే మాటలు కాదు. కానీ టాలీవుడ్లో కొంతమంది నటీనటులు నటన తో పాటు వైద్య వృత్తిని కూడా కొనసాగిస్తున్నారు. వాళ్ళు ఎవరో ఓ లుక్కేద్దాం రండి :

1) సాయి పల్లవి :

టాలీవుడ్ స్టార్ హీరోయిన్, లేడీ పవన్ కళ్యాణ్ గా గుర్తింపు పొందిన సాయి పల్లవి.. డాక్టర్ కోర్స్ కూడా చేసింది అని ఎక్కువ మందికి తెలిసుండదు. తనకు కోట్లకి కోట్లు పారితోషికం ఆఫర్ చేసినా ఆమెకు నచ్చిన పాత్రలే చేస్తుంటుంది. పెద్ద సినిమాల్లో అవకాశాల కోసం పాకులాడే మనస్తత్వం కాదు ఈమెది. కమర్షియల్ యాడ్స్ లో కూడా ఈమె నటించడానికి ఇష్టపడదు. ఇప్పటికే అలా చాలా ఆఫర్లు వదిలేసుకుంది. పేద వారి కోసం డాక్టర్ అవుతాను, తాను సంపాదించింది అంతా అందుకే ఖర్చు పెడతాను అని చెబుతుంది ఈ బ్యూటీ.

2) రాజ శేఖర్ :

టాలీవుడ్లో స్టార్ హీరోగా ఓ వెలుగు వెలిగిన రాజశేఖర్.. గతంలో ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించారు. ఈయన డాక్టర్ అన్న సంగతి కూడా అందరికీ తెలిసిందే. ఈయన హస్తవాసి చాలా మంచిది అనే సెంటిమెంట్ కూడా ఇండస్ట్రీలో ఉంది. ఈయన ఎంత పెద్ద డాక్టర్ అనేది నటుడు సునీల్ ఓ సందర్భంలో చెప్పుకొచ్చాడు. తన కూతురు చావుబ్రతుకుల్లో ఉంటే రాజశేఖర్ కాపాడారని సునీల్ చెప్పుకొచ్చారు. ఓ పక్క నటుడిగా కొనసాగుతూనే వైద్య వృత్తి కూడా కొనసాగిస్తున్నారు ఆయన.

3) భరత్ రెడ్డి :

సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా రాణిస్తున్న భరత్ రెడ్డి కూడా డాక్టర్ అని ఎక్కువ మందికి తెలిసుండదు. వైజాగ్ కు చెందిన భరత్ సినిమాలపై ఆసక్తి తో నటుడిగా మారాడు.

4) భద్రం :

కమెడియన్ గా ‘భలే భలే మగాడివోయ్’ ‘మహానుభావుడు’ ‘ప్రతీరోజూ పండగే’ వంటి పలు సూపర్ హిట్ సినిమాల్లో నటించిన భద్రం కూడా డాక్టర్ అన్న సంగతి ఎక్కువ మందికి తెలిసుండకపోవచ్చు. ఆంధ్రప్రదేశ్ లోని రాజమండ్రికి చెందిన ఇతను ఎర్గొనోమిక్స్‌ ((ఫిజియోథెరపిస్ట్‌) గా పనిచేస్తున్నాడు.

5) ప్రభాకర్ రెడ్డి :

ఒకప్పటి ఈ విలక్షణ నటుడు కూడా డాక్టరే. ఈయన మెడిసిన్ కంప్లీట్ చేసి..అటు తర్వాత కొంత కాలం ప్రాక్టీస్ చేయడం కూడా జరిగింది.అటు తర్వాత సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. ఇక్కడ కూడా స్టార్ గా ఎదిగారు.

6) అల్లు రామలింగయ్య :

1000కి పైగా సినిమాల్లో నటించి గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో స్థానం సంపాదించుకున్న అల్లు రామలింగయ్య కూడా వైద్యుడే. కాకపోతే ఈయన ఆయుర్వేదంలో స్పెషలిస్ట్. ఓ పక్క సినిమాలు చేస్తూనే మరో పక్క వైద్య వృత్తి కూడా కొనసాగించారు ఆయన.

7) శివానీ రాజశేఖర్ :

తండ్రి రాజశేఖర్ అడుగు జాడల్లోనే ఈమె కూడా మెడిసిన్ కోర్స్ చేస్తుంది. మరో పక్క వరుస సినిమాల్లో కూడా నటిస్తుంది.

8) నివేదా థామస్ :

మంచి మంచి పాత్రలు ఎంపిక చేసుకుంటూ తనకంటూ క్రేజ్ ను సంపాదించుకున్న నివేదా థామస్ కూడా డాక్టర్ కోర్సు చేస్తుంది. మరోపక్క ప్రాక్టీస్ కూడా మొదలు పెట్టింది.

9) అజ్మల్ అమీర్ :

‘రంగం’ చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన ఈయన ‘రచ్చ’ ‘అమ్మ రాజ్యంలో కడప బిడ్డలు’ వంటి చిత్రాల్లో కూడా నటించింది. ఇతను కూడా మెడిసిన్ చదివాడు. డాక్టర్ కోర్స్ లో శిక్షణ తీసుకుంటున్నాడు.

10) రూప కొడువయూర్ :

వెంకటేష్ మహా దర్శకత్వంలో సత్యదేవ్ హీరోగా తెరకెక్కిన రూప కొడువయూర్ కూడా డాక్టర్ అని ఎక్కువ మందికి తెలిసుండదు. అలాగే ఈమె క్లాసికల్ డాన్సర్ కూడా..!

Read Today's Latest Focus Update. Get Filmy News LIVE Updates on FilmyFocus