Ajith: అజిత్ నాన్ హీరో లైఫ్ చూస్తారా? త్వరలో థియేటర్లకు.. ఆ తర్వాత ఓటీటీకి!
- March 6, 2026 / 12:39 PM ISTByFilmy Focus Desk
ఏదైనా సినిమా వచ్చిన తర్వాతనో, లేక సినిమా వచ్చేముందునో ఆ సినిమా గురించి, అందులో నటించిన ముఖ్య పాత్రధారుల గురించి డాక్యుమెంటరీలు తీస్తుంటారు. ఇలాంటి పనులు ప్రస్తుతం ఎక్కువగా చేస్తున్నది నెట్‌ఫ్లిక్స్. గత కొన్నేళ్లుగా ప్రముఖ దర్శకుడు రాజమౌళి చుట్టూ ఈ డాక్యుమెంటరీలు తిరుగుతూ ఉన్నాయి. ఇప్పుడు సినిమా పరిశ్రమలో మరో ఆసక్తికర డాక్యుమెంటరీకి రంగం సిద్ధమవుతోందని సమాచారం. ఈసారి సినిమా గురించి కాదు, సినిమా హీరో గురించి చేయబోతున్నారు. అయితే అది సినిమాల గురించి కాదట.
Ajith
అవును, మీరు చదివింది నిజమే. సినిమా హీరో గురించే ఆ డాక్యుమెంటరీ రూపొందిస్తున్నా అందులో నాన్ సినిమా కంటటెంట్ ఉండబోతోందట. ఎవరి మీద ఈ డాక్యుమెంటరీ రూపొందిస్తున్నారో తెలిస్తే.. అందులో ఏం చూపించబోతున్నారో మీకే ఊహించేస్తారు. ప్రముఖ తమిళ కథానాయకుడు అజిత్ గురించి ఈ డాక్యుమెంటరీ ఫిల్మ్ ఉండబోతోందట. మీరు ఊహిస్తున్నట్లే ఆయన కార్ రేసింగ్ గురించి అందులో చూపించబోతున్నారు, చర్చించబోతున్నారట.
దీనిని తెరకెక్కిస్తోంది మనసును హత్తుకునే సినిమాలు తీయడంలో సిద్ధహస్తుడైన ఏఎల్ విజయ్. ఇక దీనికి నేపథ్య సంగీతం జీవీ ప్రకాశ్ కుమార్ అందిస్తున్నారు. తొలుత ఈ ఫిల్మ్‌ను థియేటర్లలో విడుద చేసి, ఆ తర్వాత ఓటీటీలో స్ట్రీమ్ చేయాలని నెట్‌ఫ్లిక్స్ అనుకుంటోందట. మే 1న ఈ డాక్ ఫిల్మ్‌ను రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారట. దీని కోసం ఇప్పటికే ఏఎల్ విజయ్ దుబాయి వెళ్లి షూటింగ్ చేయించి వచ్చారట. ఇందులో కొందరు సినిమా జనాలు కూడా కనిపిస్తారట. వారంతా అజిత్ రేస్‌ని చూడటానికి వెళ్లినవారే అని సమాచారం.
దీనికి సంబంధించిన అధికారిక అప్‌డేట్ త్వరలో వెల్లడిస్తారని సమాచారం. ఇక అజిత్ సినిమాల విషయానికొస్తే.. త్వరలో అధిక్ రవిచంద్రన్ దర్శకత్వంలో సినిమా చేస్తారని సమాచారం. తనతో నాలుగు హిట్ సినిమాలు చేసిన శివ దర్శకత్వంలోనూ ఓ సినిమా ఉండనుంది అని సమాచారం.











