Dragon: ‘డ్రాగన్‌ 2’ పక్కా.. ఏడాది పూర్తయిన సందర్భంగా దర్శకుడి టీజింగ్‌ పోస్ట్‌

తమిళంలో ‘డ్రాగన్‌’.. తెలుగులో ‘రిటర్న్‌ ఆఫ్‌ ది డ్రాగన్‌’ సినిమా వచ్చి ఏడాది అయిపోయింది తెలుసా? నిన్న మొన్న వచ్చినట్లుంది అప్పుడే సంవత్సరం అయిపోయిందా అని అనుకుంటున్నారా? అవును మరి.. కాలం గిర్రున తిరిగేసింది. ఈ నేపథ్యంలో సినిమా టీమ్‌ తమ ఆనందాన్ని వ్యక్తం చేస్తూ సోషల్‌ మీడియాలో పోస్టులు కూడా పెట్టింది. ఈ క్రమంలో ఈ సినిమా సీక్వెల్‌కి రెడీ అవ్వండి అనే టీజ్ కూడా జరిగిపోయేది. ఆ టీజ్‌ చేసింది ఈ సినిమా దర్శకుడు అశ్వత్‌ మరిముత్తు.

Dragon 2

ప్రదీప్‌ రంగనాథన్‌, కయాదు లోహర్‌ ప్రధాన పాత్రల్లో రూపొందిన చిత్రం ‘డ్రాగన్‌’. ‘లవ్ టుడే’ సినిమాతో మంచి గుర్తింపు సంపాదించిన ప్రదీప్ రంగనాథన్ హీరోగా నటించిన ఈ చిత్రాన్ని తెలుగులో రిలీజ్ చేసినప్పుడు తొలుత సరైన రెస్పాన్స్‌ లేదు. అయితే ఆ తర్వాత మౌత్‌ టాక్‌తో మంచి విజయం అందుకుంది. మొత్తంగా ఈ సినిమా రూ.140 కోట్లు వసూళ్లు సాధించింది. ఇక ఓటీటీలోకి వచ్చాక ఈ సినిమాకు మరింత ఆదరణ దక్కింది. ‘లవ్‌ టుడే’, ‘డ్యూడ్‌’, ‘డ్రాగన్‌’ అంటూ ప్రదీప్‌ రంగనాథన్‌ హ్యాట్రిక్‌ సాధించేశాడు.

అశ్వత్ మరిముత్తు తన సోషల్‌ మీడియా పోస్టులో ప్రదీప్‌ను సెల్ఫ్ మేడ్ స్టార్‌గా అభివర్ణిస్తూ తన సంతోషాన్ని వ్యక్తపరిచారు. ఈ సినిమా తమకు ఎంత స్పెషలో చెబుతూ పోస్టు చివర్లో తాము రెండోసారి తప్పకుండా వస్తామంటూ 2 నంబర్‌కు కోట్స్ పెట్టారు. అలా ‘డ్రాగన్’కు సీక్వెల్ ఉంటుందని చెప్పకనే చెప్పేశారు. మరి ఎలాంటి కథతో ఈ సినిమా చేస్తారు, గత సినిమాకు కొనసాగింపుగా ఉంటుందా? లేక కొత్త కథను ఈ పేరుతో తెరకెక్కిస్తారా అనేది చూడాలి.

ప్రస్తుతం ‘లవ్‌ ఇన్సూరెన్స్‌ కంపెనీ’ అనే సినిమాతో ప్రదీప్‌ రంగనాథన్‌ బిజీగా ఉన్నారు. ఈ సినిమా తర్వాత ఏ సినిమా చేసేది ఇంకా అనౌన్స్‌ చేయలేదు. మరి అశ్వత్‌ చెప్పినట్లుగా ‘డ్రాగన్‌ 2’ వస్తుందా అనేది చూడాలి. ఈసారి అన్ని భాషల్లోనూ ఒకేసారి రిలీజ్‌ చేసే అవకాశం ఉంది.

అలాంటి ప్రయత్నాలు చేయను.. ఇలా ఉంటే బెటర్‌: సుదర్శన్‌ కామెంట్స్‌

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus