డ్యూయల్ రోల్స్ తో మెప్పించిన మన స్టార్స్

సినిమా చూసేటప్పుడు హీరో కనిపిస్తే చాలు థియేటర్ చప్పట్లతో నిండిపోవాల్సిందే. అదే హీరో ద్వి పాత్రాభినయం చేస్తే అభిమానులకు సంబరమే. ఎన్టీఆర్, ఏఎన్ఆర్ లు డ్యూయల్ రోల్ పోషించి డబుల్ ధమాకా అందించారు. ఇప్పుడు కూడా స్టార్స్ ద్వి పాత్రాభినయం చేస్తూ మెప్పిస్తున్నారు. అటువంటి సినిమాలపై ఫోకస్..

కమల హాసన్ ఒక సినిమాలో ఒకటికి మించి పాత్రలు పోషించడంలో కమల్ హాసన్ ముందు ఉంటారు. దశావతారంలో పది పాత్రలు పోషించి ఔరా అనిపించారు. కమల్ డ్యూయల్ రోల్ సినిమాల్లో భారతీయుడు నంబర్ వన్ స్థానంలో నిలుస్తుంది.

చిరంజీవి రౌడీ అల్లుడు, స్నేహం కోసం, అందరి వాడు… ఇలా చిరంజీవి అనేక డ్యూయల్ రోల్ సినిమాలు చేశారు. తొమ్మిదేళ్ల తర్వాత చేసిన ఖైదీ నంబర్ 150 లోను ద్వి పాత్రాభినయంతో అలరించారు.

బాలకృష్ణ నందమూరి బాలకృష్ణ అప్పట్లో ఆదిత్య 369 సినిమాలో డ్యూయల్ రోల్ చేసి హిట్ కొట్టారు. రీసెంట్ గా లయన్ సినిమాలో డ్యూయల్ రోల్ పోషించారు. గాడ్సే, బోస్ పాత్రల్లో యాక్షన్ ఇరగదీసారు.

నాగార్జున అక్కినేని నాగార్జున డ్యూయల్ రోల్ చేసిన హలో బ్రదర్ రికార్డ్స్ బద్దలు కొట్టింది. మళ్లీ తాజాగా సోగ్గాడే చిన్ని నాయనలో ద్వి పాత్రాభినయం చేసి విజయాన్ని అందుకున్నారు.

వెంకటేష్ విక్టరీ వెంకటేష్ దేవీ పుత్రుడు సినిమాలో రెండు పాత్రలు పోషించారు. బలరామ్, కృష్ణుడు పాత్రల్లో మంచి వేరియేషన్స్ చూపించారు.

ప్రభాస్ బిల్లా సినిమాలో ప్రభాస్ ద్వి పాత్రాభినయం చేశారు. ఇది యావరేజ్ గా నిలిచినా బాహుబలి మాత్రం బంపర్ హిట్ అయింది. ఇందులో అమరేంద్ర బాహుబలి, మహేంద్ర బాహుబలిగా ఆకట్టుకున్నారు.

రవితేజమాస్ మహారాజ్ రవితేజ కూడా డ్యూల్ రోల్స్ తో అదరగొట్టారు. విక్రమార్కుడులో దొంగ, పోలీస్ గా హాస్యాన్ని, యాక్షన్ ని అందించారు. కిక్ 2 లోను రవితేజ ద్వి పాత్రాభినయం చేశారు.

రామ్ చరణ్ రామ్ చరణ్ రెండో సినిమాతోనే రెండు పాత్రలకు సై అన్నారు. మగధీర చిత్రంలో కాలభైరవగా, హర్షగా చక్కని నటన ప్రదర్శించారు. ఆ తర్వాత నాయక్ సినిమాలోనూ డ్యూయల్ రోల్ చేసి హిట్ సొంతం చేసుకున్నారు.

ఎన్టీఆర్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ యాక్షన్ అంటే అందరికీ ఇష్టం. కామెడీ చేస్తే కూడా బాగుంటుందని నిరూపించిన సినిమా అదుర్స్. ఇందులో ఒక పాత్ర సీరియస్ గా ఫైట్స్ చేస్తుంటే.. మరో పాత్ర పంచ్ లతో నవ్వులు పూయించింది.

నాని నేచురల్ స్టార్ నాని ప్రేమ కథలతో విజయాలను తన ఖాతాలో వేసుకుంటున్నారు. జెంటిల్ మ్యాన్ సినిమాలో రెండు పాత్రలు పోషించి శెభాష్ అనిపించుకున్నారు.

గోపిచంద్ గోపిచంద్ విలన్ గా, హీరోగా విజయాలను అందుకున్నారు. ఈ రెండు పాత్రలను గౌతమ్ నంద సినిమాలో కలిపి చూపించారు, గౌతమ్ ఘట్టమనేని, నంద కిషోర్ క్యారెక్టర్లో అద్భుతంగా నటించారు.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus