Tollywood: మే నెల ప్రాగ్రెస్.. డబ్బింగ్ సినిమాలే ప్రాణం పోశాయి

సంక్రాంతికి వచ్చిన ‘మన శంకర వరప్రసాద్ గారు’ తర్వాత టాలీవుడ్..కి(Tollywood) అవసరమైన ఒక్క బ్లాక్ బస్టర్ కూడా పడలేదు. అందువల్ల గత 4 నెలల్లో తెలుగు రాష్ట్రాల్లో దాదాపు 30 శాతం సింగిల్ స్క్రీన్స్ మూతబడ్డాయి అంటే నమ్ముతారా.? కానీ ఇది నిజం.

Tollywood

సరైన పెద్ద సినిమాలు, బ్లాక్ బస్టర్లు లేక.. కరెంట్ బిల్లుల వంటి మెయింటెనెన్స్ ఛార్జీల భారం భరించలేక.. చాలా సింగిల్ స్క్రీన్స్ ను థియేటర్ ఓనర్లు తాత్కాలికంగా మూసేశారు.

ఈ నేపథ్యంలో హాలిడే సీజన్ అయినటువంటి మే నెల కూడా పెద్ద సినిమాలు లేక విలవిలలాడింది.మే నెలలో దాదాపు 30కి పైగా సినిమాలు రిలీజ్ అయ్యాయి. ‘గాయపడ్డ సింహం’ ‘జెట్లీ’ ‘గోదారి గట్టుపైన’ ‘రేజర్’ ‘సతీ లీలావతి’ ‘అగ్లీ స్టోరీ’ ‘మరీచిక’ వంటి సినిమాలతో పాటు ‘వీరభద్రుడు’ ‘దృశ్యం 3’ ‘బ్లాస్ట్ జోన్’ వంటి డబ్బింగ్ సినిమాలు… ఇంకా అనేక చిన్న సినిమాలు రిలీజ్ అయ్యాయి. కానీ వీటిలో ‘వీరభద్రుడు’ ‘దృశ్యం 3’ వంటి సినిమాలు మాత్రమే బాగా పెర్ఫార్మ్ చేశాయి.

‘గోదారి గట్టుపైన’ యావరేజ్ గా నిలవగా ‘బ్లాస్ట్ జోన్’ కూడా బాగానే కలెక్ట్ చేస్తుంది. సో.. మొత్తంగా చూసుకుంటే.. ఈ మే నెలకి డబ్బింగ్ సినిమాలే ఊపిరి పోశాయని చెప్పాలి. సొ ఇప్పుడు అందరి చూపు జూన్ నెలపై పడింది. రామ్ చరణ్ నటించిన ‘పెద్ది’ సినిమా జూన్ మొదటి వారంలో విడుదల కానుంది. ఆ సినిమాతో టాలీవుడ్ కష్టాలు చాలా వరకు తీరతాయని అటు డిస్ట్రిబ్యూటర్లు, ఇటు నిర్మాతలు ఆశలు పెట్టుకున్నారు. చూడాలి మరి ఏమవుతుందో..!

రామ్ చరణ్ సర్జరీ వాయిదా వేసుకున్నాడా.. మామూలు రిస్క్ కాదిది

Read Today's Latest Movies Update. Get Filmy News LIVE Updates on FilmyFocus