ఏ స్టార్ హీరోకైనా, స్టార్ హీరోయిన్ (Star Actress) కైనా మేనేజర్లు కీలక పాత్ర పోషిస్తారు అన్న సంగతి తెలిసిందే. సరైన ప్రాజెక్టులు వాళ్ళ దగ్గరకు పట్టుకెళ్ళాల్సిన బాధ్యత మేనేజర్లదే..! అలాగే ఏ స్టార్ డైరెక్టర్ లేదా స్టార్ ప్రొడ్యూసర్.. అయినా వారిని కలవాలి అంటే మొదట వీళ్ళనే సంప్రదించాలి. అయితే మేనేజర్లు సరైన విధంగా గైడ్ చేయకపోతే స్టార్స్ కెరీర్లకు పెద్ద ఇబ్బంది తలెత్తుతుంది.గతంలో మేనేజర్ ల ఇబ్బంది పడ్డ స్టార్ హీరోలు, స్టార్ హీరోయిన్లు కూడా ఉన్నారు.
రెండు, మూడేళ్ళ క్రితం హీరోయిన్ పాయల్ రాజ్ పుత్ కూడా తన మేనేజర్ ను నమ్మి మోసపోయినట్టు బహిరంగంగానే చెప్పుకొచ్చింది. అచ్చం ఇలాగే ఒకప్పటి స్టార్ హీరోయిన్ కెరీర్ కూడా మేనేజర్ వల్ల కొలాప్స్ అయిపోయింది అనే వార్త వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళితే.. ‘అతిథి’ చిత్రంతో టాలీవుడ్ కు పరిచయమైన హీరోయిన్ అమృతా రావుని తన మేనేజర్ మోసం చేశాడని తెలిపింది. ఆమె రచించిన ‘కపుల్ ఆఫ్ థింగ్స్’ పుస్తకాన్ని ఈ మధ్యనే విడుదల చేసింది అమృత.
ఇందులో ఆమె కెరీర్ అనుభవాలను షేర్ చేసుకుంది. ఈ నేపథ్యంలో సల్మాన్ ఖాన్ ‘వాంటెడ్’ చిత్రంలో ఆమెకు హీరోయిన్ ఛాన్స్ వస్తే మేనేజర్ ఈ విషయాన్ని చెప్పకుండా ప్రతీకారం తీర్చుకున్నట్లు ఆమె తెలిపింది. ఈ విషయం ఆమెకు లేట్ గా తెలిసిందట. అదెలా అంటే.. ‘ఓ సినిమా షూటింగ్ కోసం హోటల్లో స్టే చేస్తున్నాను. అక్కడ ఓ ప్రొడక్షన్ డిపార్ట్మెంట్ కు చెందిన వ్యక్తి నన్ను కలిశాడు. ‘హాయ్ అమృత! ఎలా ఉన్నావ్? మా డేట్స్ క్లాష్ కాకపోతే..
మీరు సల్మాన్ తో ‘వాంటెడ్’లో నటిస్తూ బిజీగా ఉండేవారు’ అని అన్నాడు. దీంతో నేను షాక్ అయ్యాను. అప్పుడు మా మేనేజర్ వైపు చూస్తే..’మీరు సమయం కేటాయించడం అసాధ్యం. అందుకే చెప్పలేదు’ అంటూ చెప్పాడట. ప్రభుదేవా దర్శకత్వం వహించిన ‘వాంటెడ్’ చిత్రంలో అయేషా టాకియా హీరోయిన్ గా నటించింది. ఈ సినిమాతో సల్మాన్ ఖాన్ స్ట్రాంగ్ కంబ్యాక్ ఇచ్చాడు.
హీలీవుడ్లో నటించిన 15 మంది ఇండియన్ యాక్టర్స్ వీళ్లే..!
టాలీవుడ్లో గుర్తింపు తెచ్చుకున్న 10 మంది కోలీవుడ్ డైరెక్టర్స్ వీళ్లే..!
తు..తు…ఇలా చూడలేకపోతున్నాం అంటూ…బాడీ షేమింగ్ ఎదురుకున్న హీరోయిన్లు వీళ్ళే
నాగ శౌర్య నటించిన గత 10 సినిమాల బాక్సాఫీస్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందంటే?