Kollywood: కోలీవుడ్‌లో షాకింగ్‌ ఘటన.. వ్యాన్‌లో ఏకే 47 గన్స్.. తర్వాత ఏమైందంటే?

చెన్నైలో ఇటీవల జరిగిన ఓ చిన్న విషయం కోలీవుడ్‌ని కాసేపు షేక్‌ చేసింది అని అంటున్నారు. ఓ వ్యాన్‌లో పదికిపైగా ఏకే 47 గన్స్‌ పట్టుబడిన ఘటన చెన్నై శివార్లలో జరిగిందట. నగరంలో అన్ని గన్స్‌ ఒక దగ్గర దొరకడం ఏంటి అని పోలీసులు అలర్ట్ అయ్యారట. తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికలు త్వరలో జరగనున్న నేపథ్యంలో పోలీసులు సాధారణ సోదాలు చేపడుతుండగా అశోక్‌ నగర్‌ ప్రాంతంలో ఈ గన్స్‌ బయటపడ్డాయట.

Kollywood

దీంతో అలర్ట్‌ అయిన పోలీసులు దీనిపై విచారణ చేపట్టగా అవి నిజమైన గన్స్‌ కావని తేలిందట. ఓ సినిమా కోసం ఆ డమ్మీ గన్స్‌ను తీసుకొస్తున్నట్లు గుర్తించారట. అసలేంలా సినిమా అని చూస్తే.. లోకేశ్‌ కనగరాజ్‌ హీరోగ అరుణ్‌ మాతేశ్వరన్‌ తెరకెక్కిస్తున్న ‘డీసీ’ సినిమా షూటింగ్‌ కోసం తెప్పించిన గన్స్‌ అని తేలింది. చూడటానికి నిజం గన్స్‌లో ఉండటంతో పోలీసులు అలర్ట్‌ అయ్యారట. అవసరమైన డాక్యుమెంట్లు చూపించి సినిమా టీమ్‌ ఆ గన్స్‌ తీసుకెళ్లిందట.

దీంతో ఈ వ్యవహారం ఇప్పుడు సోషల్‌ మీడియాలో, తమిళ సినిమా రంగంలో వైరల్‌గా మారింది. సినిమాలో రియలిస్టిక్‌ లుక్‌ కోసం ఇలా ఒరిజినల్‌ గన్స్‌ని పోలిన గన్స్‌ను టీమ్‌ తీసుకురాడం ఓకే కానీ.. ఇలా ఆందోళన కలిగించడం కరెక్ట్‌ కాదు అని వాదనలు వినిపిస్తున్నాయి. ఇక ‘డీసీ’ సంగతికొస్తే.. హీరోగా లోకేశ్‌ కనగరాజ్‌కిది తొలి సినిమా. దర్శకుడిగా బ్లాక్‌బస్టర్ అనిపించుకున్న (ఇప్పుడు కాదులెండి) లోకేశ్‌ హీరోగా తొలి అడుగు ఎలా వేస్తారో చూడాలి.

ఈ సినిమా అయ్యేలోపు లోకేశ్‌ టీమ్‌.. అల్లు అర్జున్‌ సినిమా కోసం కథను సిద్ధం చేస్తారట. ఈ లోపు ఆయన అట్లీ సినిమా పూర్తి చేసుకుంటే లోకేశ్‌ కొత్త సినిమాను స్టార్ట్‌ చేస్తారు అని సమాచారం. చూడాలి మరి ఎప్పుడు ఏం జరుగుతుందో. ‘కూలీ’ సినిమాతో వసూళ్లు అందుకున్నా ఇమేజ్‌ పరంగా లోకేశ్‌కి బాగా డ్యామేజ్‌ జరిగింది. మరిప్పుడు అల్లు అర్జున్‌ సినిమాతో దాన్ని ఫిల్‌ చేసుకుంటారేమో చూడాలి.

 రజనీకాంత్‌ సినిమా కోసం 83 గెటప్‌లు రెడీ చేసిన డైరక్టర్‌.. ఎందుకంటే?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus
Tags