Dunki Collections: ‘డంకీ’ మొదటి రోజు కలెక్షన్లు.. అనుకున్న దానికంటే తక్కువ?

  • December 22, 2023 / 10:01 PM IST

బాలీవుడ్ బాద్ షా షారుఖ్ ఖాన్ హీరోగా రాజ్ కుమార్ హిరానీ దర్శకత్వంలో రూపొందిన మూవీ ‘డంకీ’. నిన్న అనగా డిసెంబర్ 21 న ప్రేక్షకుల ముందుకు వచ్చింది ఈ సినిమా. అపజయమంటూ ఎరగని బాలీవుడ్ స్టార్ దర్శకుడిగా రాజ్ కుమార్ హిరానికి మంచి పేరు ఉంది. షారుఖ్ ఖాన్ కూడా ఈ ఏడాది ‘పఠాన్’ ‘జవాన్’ వంటి సూపర్ హిట్లతో సూపర్ ఫామ్లో ఉన్నాడు. అలాంటప్పుడు సహజంగానే ఈ కాంబినేషన్ పై భారీ అంచనాలు ఏర్పడతాయి.

షారూక్ ఖాన్‌తో పాటు తాప్సీ పన్ను, బోమన్ ఇరాని, విక్కీ కౌశల్, విక్రమ్ కొచ్చర్, అనీల్ గ్రోవర్ వంటి స్టార్స్ కూడా ఈ సినిమాలో ముఖ్య పాత్రలు పోషించారు. ‘జియో స్టూడియోస్’ ‘రెడ్ చిల్లీస్ ఎంటర్టైన్మెంట్స్’ ‘రాజ్ కుమార్ హిరాని ఫిలిమ్స్’ బ్యానర్ పై గౌరీ ఖాన్, రాజ్ కుమార్ హిరాని, జ్యోతి దేశ్ పాండే ..లు కలిసి ఈ చిత్రాన్ని నిర్మించారు. అయితే నిన్న రిలీజ్ అయిన ఈ సినిమా ప్రేక్షకుల అంచనాలు అందుకోవడంలో విఫలమయ్యింది అని చెప్పాలి.

అయినప్పటికీ మొదటి రోజు సోలో రిలీజ్ దక్కింది, ఎక్కువ థియేటర్లు ఉన్నాయి కాబట్టి.. ‘డంకీ’ సినిమా మొదటిరోజు వరల్డ్ వైడ్ గా రూ.65 కోట్ల నుండి రూ.70 కోట్ల గ్రాస్ ను అందుకునే అవకాశం ఉంది అనుకుంటే.. ఆ ఫీట్ ను అందుకోవడంలో విఫలమైంది. ట్రేడ్ పండితుల సమాచారం ప్రకారం.. ‘డంకీ’ మొదటి రోజు రూ.60 కోట్ల గ్రాస్ మార్క్ కి మాత్రమే చేరుకుందట. ‘పఠాన్’ ‘జవాన్’ ..లా మాత్రం ఈ సినిమా వంద కోట్ల గ్రాస్ మార్క్ ను మొదటి రోజు అందుకోలేకపోయింది.

సలార్ సినిమా రివ్యూ & రేటింగ్!

డంకీ సినిమా రివ్యూ & రేటింగ్!
‘బిల్లా- రంగా’ టు ‘సలార్’… ఫ్రెండ్షిప్ బ్యాక్ డ్రాప్లో రూపొందిన 10 సినిమాల లిస్ట్..!

Read Today's Latest Collections Update. Get Filmy News LIVE Updates on FilmyFocus