టాలీవుడ్లో ఫెస్టివల్ సీజన్ అంటే ఎంత స్పెషలో అందరికీ తెలిసిందే. పండగ సీజన్ వస్తోంది అంటే… పెద్ద హీరోలు రెడీ అయిపోతారు. మరి రాబోతున్న సీజన్ అంటే దసరా సీజన్ అని చెప్పాలి. ఇప్పుడు ఆ సీజన్‌కి టాలీవుడ్లో స్టార్ క్లాష్ ఉండబోతోంది అనే టాక్ వినిపిస్తోంది. అన్నీ అనుకున్నట్లుగా జరిగితే రాబోయే దసరాకి మెగా వర్సెస్ నందమూరి క్లాష్ ఉండబోతోంది అని చెబుతున్నారు. అంటే చిరంజీవి వర్సెస్ బాలకృష్ణ సినిమాలు క్లాష్ ఉండొచ్చు అని సమాచారం.
చిరంజీవి ‘గాడ్‌ఫాదర్’ సినిమాను విజయదశమికి తీసుకొస్తున్నట్టు చిత్రబృందం ఇటీవల ప్రకటించింది. సినిమా ఫస్ట్ లుక్ విడుదల సందర్భంగా విజయదశమి అంటూ విడుదల తేదీని టీజ్ చేసింది చిత్రబృందం. అయితే సినిమా విడుదల తేదీని ఇంకా ప్రకటించలేదు. అయితే అక్టోబరు 5న విడుదల చేస్తారని వార్తలొస్తున్నాయి. అయితే అది బుధవారం. గతంలో చిరంజీవి సినిమాలు బుధవారం విడుదలైన సందర్భాలున్నాయి. అయితే చిరంజీవితో దసరా బరిలో బాలకృష్ణ కూడా వస్తున్నారని సమాచారం.
గోపీచంద్ మలినేని – బాలకృష్ణ కాంబినేషన్లో #NBK107 సినిమా రూపొందుతోంది. ఈ సినిమాను కూడా దసరా బరిలోకి దింపాలని చిత్రబృందం ఆలోచిస్తోందట. గతంలో బాలయ్య – చిరంజీవి ఫెస్టివల్ ఫేస్ఆఫ్లు చాలా ఆసక్తికరంగా సాగాయి. ఇప్పుడు అదే ఫేస్ఆఫ్ జరగబోతోందని చెబుతున్నారు. అయితే సినిమాకు సంబంధించి వర్క్ ఇంకా పెండింగ్‌లో ఉందని కొందరు చెబుతుంటే, సినిమా దసరా సమయానికి సిద్ధమైపోతుందని మరికొంతమంది చెబుతున్నారు. దీంతో దసరాకు మెగా వర్సెస్ సింహం పక్కా అని చెప్పొచ్చు.
అయితే దసరాకు వస్తున్నాం అంటూ చాలా రోజుల క్రితమే, సినిమా ప్రారంభోత్సవం సమయంలోనే రవితేజ ప్రకటించారు. ఆ సినిమానే ‘రావణాసుర’. మరోవైపు సమంత ప్రధాన ‘యశోద’ సినిమాను ఆగస్టు నుండి దసరా తీసుకెళ్లారు అని చెబుతున్నారు. మరిప్పుడు బాలయ్య, చిరంజీవి విజయదశమికి వస్తుండటంతో ‘రావణాసుర’, ‘యశోద’ వాయిదా పడేలా ఉన్నాయి. తాజా పుకార్ల ప్రకారం చిరంజీవి బుధవారం (అక్టోబరు 5న) వస్తే, బాలయ్య శుక్రవారం (అక్టోబరు 7న) వస్తుంది.