దువ్వాడ జగన్నాథం వచ్చేది అప్పుడే
- April 12, 2017 / 08:23 AM ISTByFilmy Focus
హరీష్ శంకర్ దర్శకత్వంలో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ చేస్తున్న సినిమా దువ్వాడ జగన్నాథమ్ రిలీజ్ పోస్ట్ పోన్ అయింది. బ్రాహ్మణ యువకుడిగా బన్నీ నటిస్తున్న ఈ చిత్రాన్నిమే 19 న రిలీజ్ చేయాలనీ నిర్మాత దిల్ రాజు మొదట్లో అనుకున్నారు. కానీ పోస్ట్ పోన్ చేశారు. కారణం సినిమా కంప్లీట్ కాకపోవడమే. కొన్నిరోజుల క్రితం అల్లు అర్జున్ కి ఆరోగ్యం బాగాలేకపోవడంతో షూటింగ్ వాయిదా పడింది. దీంతో షెడ్యూల్ ల్లో మార్పులు జరిగాయి. స్టైలిష్ స్టార్ ఇప్పుడు పూర్తిగా కోలుకున్నారు. అయినా షూటింగ్ పూర్తికావడానికి మరికొన్ని రోజులు పడుతుంది.
సో హడావిడిగా చిత్రాన్ని రిలీజ్ చేయడమెందుకని వెనక్కి తగ్గారు. అంతేకాకుండా ఈనెల 28 బాహుబలి కంక్లూజన్, జూన్ 23 న మహేష్ బాబు మూవీ వస్తున్నాయి. వీటి హంగామా తగ్గిన తర్వాత జూలై 7న దువ్వాడ జగన్నాథం రిలీజ్ చేస్తున్నట్లు చిత్రబృందం ప్రకటించింది. మహా శివరాత్రి సందర్భంగా రిలీజ్ అయిన డీజే టీజర్ సినిమాపై అంచనాలను పెంచేసింది.
Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

















