సినిమా అంటేనే కాస్త టాలెంట్ తో పాటు అదృష్టం కూడా కలసి రావాలి…అయితే ఇప్పుడు ఈ ఫిలాసపీ ఎందుకు అంటే…ఒకసారి ఈ మ్యాటర్ చదవండి…టాలీవుడ్ లో స్టైలిష్ స్టార్ గా దూసుకుపోతున్న అల్లు అర్జున్ కి గత ఏడాది సరైసోడు తో మంచి హిట్ వచ్చింది…అయితే కధ పరంగా, కధనం పరంగా రొటీన్ సినిమా అయినప్పటికీ…డైరెక్టర్ బోయపాటి బ్రాండ్ స్క్రీన్ప్లే తో సినిమా మాస్ కి సూపర్ గా రీచ్ అయ్యింది. అయితే అదే ఊపులో గబ్బర్ సింగ్ డైరెక్టర్ హరీష్ శంకర్ తో ఈ ఏడాది బన్నీ చేసిన సినిమా డీజె….ఈ సినిమా మొదలు పెట్టిన సమయం నుంచి అన్నీ కష్టాలే…గత నెల 23 న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ అయ్యిన ఈ సినిమా రిలీజ్ రోజు నుంచే డిజాస్టర్ టాక్ ను సొంతం చేసుకుంది… అయితే వేరే ఏ సినిమాలు లేకపోవడంతో మన తెలుగు రాష్ట్రాల్లో బాగానే రన్ అవుతూ ఉండడం విశేషం. ఇక ఇదిలా ఉంటే అసలు చిక్కు అల్లా…ఓవర్సీస్ లో వచ్చింది….ఈ సినిమాని ఓవెర్సీస్ లో కొనుక్కున్న వారికి కష్టాలు తప్పేలా లేవంటున్నారు ట్రేడ్ పండితులు.
ఈ సినిమాని అక్కడ 8 కోట్లకు కొనుక్కున్నారు, పైగా ఖర్చులు అలాగే మెయింటనెన్స్ మిగతా ఖర్చులు అన్నీ పోను 8 కోట్లు రావాలి అంటే ఓవర్ సీస్ లో 12 కోట్ల వరకు రాబట్టాలి కానీ ఇప్పటి వరకు అక్కడ వచ్చింది 6కోట్లు వసూళ్లు చేయడంతో టెన్షల్లో పడ్డారు. దీంతో లాభం లేదనుకున్న చిత్ర యూనిట్ ప్రస్తుతం అమెరికా పర్యటన చేస్తోంది. అయితే ఇక్కడే ఇంకో ట్విష్ట్ ఉంది….ఈ ట్రిప్ వల్ల….వీళ్ళ వల్ల కొంతవరకు కలెక్షన్లు మెరుగు పడతాయి, కాస్త నష్టాలు తగ్గుతాయి కానీ అదే రీతిలో ఖర్చు కూడా ఉంటుంది మరి . మొత్తంగా చూసుకుంటే మాత్రం ఈ సారి ఈ సినిమా ని నమ్ముకున్న బయ్యర్స్ కి మాత్రం తిప్పలు తప్పేలా తప్పడంలేదు అని ఇట్టే అర్ధం అయిపోతుంది…
Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.