ఆర్ఆర్ఆర్ ఆస్కార్ ఖర్చుపై దానయ్య షాకింగ్ కామెంట్స్.. ఏమన్నారంటే?

  • March 21, 2023 / 04:47 PM IST

ఆర్ఆర్ఆర్ మూవీకి దానయ్యే నిర్మాత అయినా ఈ సినిమా ఆస్కార్ ప్రమోషన్స్ లో ఆయన అస్సలు కనిపించలేదనే సంగతి తెలిసిందే. దానయ్య తాజాగా ఒక యూట్యూబ్ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ షాకింగ్ విషయాలను వెల్లడించారు. ఆర్ఆర్ఆర్ కు నేను నిర్మాత అని నాకు ఆ గౌరవం దక్కిందని దానయ్య తెలిపారు. నన్ను తొక్కేశారని జరిగిన ప్రచారంలో నిజం లేదని ఆయన కామెంట్లు చేశారు. చిరంజీవితో సినిమా చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయని దానయ్య కామెంట్లు చేశారు.

మంచి కథ కోసం ఎదురుచూస్తున్నానని ఆయన చెప్పుకొచ్చారు. ప్రభాస్ తో సినిమా చేయాలని ఉందని దానయ్య పేర్కొన్నారు. బాలయ్యతో సీమ సింహం చేశానని ఆయన అన్నారు. ఆర్ఆర్ఆర్ మూవీకి 450 కోట్ల రూపాయల బడ్జెట్ అయిందని ఆయన తెలిపారు. 1200 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్లు అంటే మొత్తం నాకు వచ్చేయవని ఆయన కామెంట్లు చేశారు. మాది వ్యవసాయ కుటుంబం అని మా ఫాదర్ టైలర్ అని దానయ్య పేర్కొన్నారు.

చెన్నైలో క్యాషియర్ గా నేను కెరీర్ మొదలుపెట్టానని ఆయన తెలిపారు. నేను ప్రతి నెలా ఒకటో తేదీ జీతం చెల్లిస్తానని అది చేయలేని రోజు సినిమా తీయనని దానయ్య అన్నారు. ఫుడ్ విషయంలో నేను రాజీ పడనని ఆయన పేర్కొన్నారు. నాకు సినిమాలు తప్ప వేరే వ్యాపారం లేదని దానయ్య చెప్పుకొచ్చారు. నేను ప్రొడక్షన్ పనులను బాగానే చూసుకుంటానని దానయ్య తెలిపారు. 2024 ఎన్నికలకు ముందే పవన్ సినిమా పూర్తి చేయాలని భావిస్తున్నానని దానయ్య చెప్పుకొచ్చారు.

ఆర్.ఆర్.ఆర్ లాభాల విషయంలో నేను హ్యాపీ అని 100 కోట్ల రూపాయల కంటే ఎక్కువ లాభం రాలేదని ఆయన పరోక్షంగా పేర్కొన్నారు. ఆస్కార్ విషయాలను రాజమౌళి చూసుకున్నారని ఆస్కార్ కోసం 80 కోట్ల ఖర్చు వార్తల్లో నిజం లేదని ఆయన అన్నారు. దానయ్య వెల్లడించిన విషయాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

హీలీవుడ్‌లో నటించిన 15 మంది ఇండియన్ యాక్టర్స్ వీళ్లే..!
టాలీవుడ్‌లో గుర్తింపు తెచ్చుకున్న 10 మంది కోలీవుడ్ డైరెక్టర్స్ వీళ్లే..!

తు..తు…ఇలా చూడలేకపోతున్నాం అంటూ…బాడీ షేమింగ్ ఎదురుకున్న హీరోయిన్లు వీళ్ళే
నాగ శౌర్య నటించిన గత 10 సినిమాల బాక్సాఫీస్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందంటే?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus