ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో ఎండలతో పాటు బాహుబలి ఫీవర్ పెరుగుతోంది. బాహుబలి బిగినింగ్ కి కొనసాగింపుగా వస్తున్న బాహుబలి కంక్లూజన్ ని ఎప్పుడెప్పుడు చూద్దామా ని అందరూ ఎదురుచూస్తున్నారు. ఈనెల 28న బాహుబలి థియేటర్లోకి రావడం ఖాయం కాబట్టి.. ఆ మూవీ టికెట్స్ ఆన్‌లైన్‌లో పెట్టిన వెంటనే కొనడానికి సిద్ధంగా ఉన్నారు. అయితే ‘బాహుబలి 2’ టికెట్ దక్కించుకోవడానికి ఇప్పుడు సులభమైన మార్గం ఒకటుంది. సింపుల్ .. ‘బాహుబలి: ది బిగినింగ్’ను మరోసారి థియేటర్లలో చూడటమే. ఇప్పుడెలా సాధ్యం అని తలపట్టుకోకండి. మేము చెప్పేది బాహుబలి హిందీ వెర్షన్ గురించి.
హిందీ భాషలో బాహుబలి సినిమాని ఈరోజు దేశవ్యాప్తంగా వెయ్యి థియేటర్లలో రిలీజ్ చేశారు. ఈనెల 17 వ తేదీ వరకు థియేటర్లలో ప్రదర్శించనున్నారు. ఈ సందర్భంగా ధర్మా ప్రొడక్షన్ ప్రత్యేక ఆఫర్‌ను తీసుకొచ్చింది. తొలిభాగం టికెట్లు కొనుగోలు చేసిన వారికి రెండో భాగం టికెట్‌పై హామీ ఇచ్చింది. దక్షిణాది రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు, కేరళలలో ఈ ఆఫర్ వర్తించక పోవడం బాహుబలి అభిమానులకు నిరాశ కలిగిస్తోంది.
Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.