సెప్టెంబ‌ర్ చివ‌రి వారంలో విడుద‌ల‌వుతున్న ‘ఈ మాయ పేరేమిటో’

సీనియ‌ర్ ఫైట్ మాస్ట‌ర్ విజ‌య్ త‌న‌యుడు రాహుల్ విజ‌య్ హీరోగా ప‌రిచ‌యం అవుతున్న చిత్రం `ఈ మాయ పేరేమిటో`. కావ్యా థాప‌ర్ హీరోయిన్‌. వి.ఎస్‌.వ‌ వర్క్స్ బేనర్‌పై రాము కొప్పుల ద‌ర్శ‌క‌త్వంలో దివ్యా విజ‌య్ ఈ ల‌వ్‌, కామెడీ అండ్ ఫ్యామిలీ ఎంట‌ర్‌టైన‌ర్‌ను నిర్మించారు. ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ గీతాఆర్ట్స్‌తో పాటు గ్లోబెల్ సినిమాస్ సంస్థ‌లు ఈ చిత్రాన్ని నైజామ్‌, ఆంధ్రా ఏరియాల్లో పంఫిణీ చేయ‌నున్నారు.

ఈ సంద‌ర్భంగా చిత్ర నిర్మాత దివ్యా విజ‌య్ మాట్లాడుతూ – “`సినిమాలో రాహుల్ విజ‌య్‌, కావ్యా థాప‌ర్ పెయిర్ తెర‌పై చ‌క్క‌గా ఉంటుంది. మంచి ఫ్యామిలీ ఎమోష‌న్స్‌తో పాటు ల‌వ్‌, కామెడీ ఎలిమెంట్స్ స‌హా అన్నీ అంశాల‌తో ద‌ర్శ‌కుడు రాముగారు సినిమాను చ‌క్క‌గా తెర‌కెక్కించారు. ట్రైల‌ర్‌కు చాలా మంచి రెస్పాన్స్ వ‌చ్చింది. అలాగే యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్‌గారు విడుద‌ల చేసిన పాట‌లు ట్రెమెండెస్ రెస్పాన్స్ వ‌చ్చింది. ఆంధ్రాలో ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ గీతా ఆర్ట్స్‌, నైజాంలో గ్లోబల్ సినిమాస్ సంస్థలు మా సినిమాను విడుద‌ల చేయ‌డం చాలా ఆనందంగాఉంది. సినిమాను సెప్టెంబ‌ర్ నాలుగో వారంలో గ్రాండ్ రిలీజ్ చేయ‌డానికి సన్నాహాలు చేస్తున్నాం“ అన్నారు.
రాహుల్ విజ‌య్‌, కావ్యా థాప‌ర్ జంట‌గా న‌టించిన ఈ చిత్రంలో రాజేంద్ర‌ప్ర‌సాద్‌, ముర‌ళీశ‌ర్మ‌, రాళ్ల‌ప‌ల్లి, ఈశ్వ‌రీరావు, ప‌విత్రా లోకేశ్‌, స‌త్యం రాజేశ్‌, జోశ్ ర‌వి, కాదంబ‌రి కిర‌ణ్ త‌దిత‌రులు ఇత‌ర తారాగ‌ణంగా న‌టిస్తున్నారు. ఈ చిత్రానికి ఫైట్స్‌: విజయ్‌, ఎడిట‌ర్‌: న‌వీన్ నూలి, ఆర్ట్‌: చిన్నా, సాహిత్యం: శ్రీమ‌ణి, సంగీతం: మ‌ణిశ‌ర్మ‌, సినిమాటోగ్ర‌ఫీ: శామ్ కె.నాయుడు, నిర్మాత‌: దివ్యా విజ‌య్‌, ద‌ర్శ‌క‌త్వం: రాము కొప్పుల.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus