‘మెగా 152’ లో ఛాన్స్ కొట్టేసిన ఈషా రెబ్బా..?

  • November 1, 2019 / 07:44 PM IST

‘సైరా నరసింహా రెడ్డి’ చిత్రం కొన్ని రికార్డులు సాధించినప్పటికీ.. బ్రేక్ ఈవెన్ మాత్రం సాధించలేక పోయింది. దీంతో చిరు, చరణ్ లు కాస్త డిజప్పాయింట్ అయినట్టు తెలుస్తుంది. అయితే ఈసారి మెగాస్టార్.. కొరటాల శివతో చేసే సినిమాతో పెద్ద హిట్ కొట్టాలని ప్లాన్ చేస్తున్నారు. ఎలాగూ కొరటాల శివ సినిమా అంటే కచ్చితంగా హిట్ అని అంతా ఫిక్సయిపోయారు. బౌండ్ స్క్రిప్ట్ కూడా కొరటాల రెడీ చేసి పెట్టుకున్నాడు. అయితే నటీ నటుల వివరాలు మాత్రం ఇంకా ఫైనల్ చేయలేదు.

ఈ చిత్రంలో త్రిష ని హీరోయిన్ గా తీసుకుంటున్నట్టు వార్తలు వస్తున్నాయి. అయితే చిత్ర యూనిట్ మాత్రం క్లారిటీ ఇవ్వలేదు. ఇదిలా ఉంటే.. ఈ చిత్రంలో మరో హీరోయిన్ కు కూడా అవకాశం ఉందట. ఈ పాత్ర కోసం మన తెలుగమ్మాయి ఈషా రెబ్బా ను అనుకుంటున్నారట. ఈషా రెబ్బా హీరోయిన్ అని కాదు కానీ ఓ ముఖ్య పాత్ర అని తెలుస్తుంది. ఈ మధ్య ఈషా రెబ్బా కూడా వరుస ఆఫర్లు దక్కించుకుంటూ మంచి ఫామ్లో ఉంది. గ్లామర్ షో విషయంలో ఈ భామ అస్సలు తగ్గడ్డం లేదు. కాబట్టి ఇలాంటి టైములో మెగాస్టార్ సినిమాలో ఛాన్స్ రావడం.. నిజంగా ఈషా రెబ్బా అదృష్టం అనే చెప్పాలి.

మీకు మాత్రమే చెప్తా సినిమా రివ్యూ & రేటింగ్!
విజిల్ సినిమా రివ్యూ & రేటింగ్!
ఖైదీ సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus