పెళ్ళి కాకుండానే తల్లైన.. ప్రముఖ లేడీ ప్రొడ్యూసర్!

హిందీలో ఎన్నో సీరియల్స్ నిర్మించిన ఏక్తా కపూర్ గురించి తెలియని వారుండరు. ఫ్యామిలీ, రొమాంటిక్‌‌, ఎమోషనల్‌ స్టోరీస్‌ ఇలా వైవిధ్యమైన కథలతో సీరియళ్లను నిర్మిస్తోన్న బాలాజీ టెలీఫిల్మ్స్‌ అధినేత్రి ఏక్తా కపూర్‌. ‘బడే అచ్చే లగ్తీ హై’ ‘కుమ్ కుమ్ భాగ్య’ ‘కుండలి భాగ్య’ ‘యే మోహబ్బతేన్’ ‘కసమ్”తెరే ప్యార్ కి’ ‘క్యూంకీ సాస్ బీ కబీ బహు థి’ సీరియల్స్‌తో ఏక్తా కపూర్ బడా నిర్మాతగా పేరుతెచ్చుకున్నారు. సీరియల్స్ తో పాటు పలు విజయవంతమైన చిత్రాలను కూడా నిర్మించి ప్రొడ్యుసర్‌గా నిలదొక్కుకున్నారు ఏక్తా. ఇక విద్యాబాలన్ తో నిర్మించిన ‘ది డర్టీ పిక్చర్’ బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలిచింది. ఈ చిత్రం కేవలం రూ. 10 కోట్లతో నిర్మింపబడి వంద కోట్లు వసూలు చేసి లాభాలు తెచ్చిపెట్టింది. ఆ తరువాత ‘రాగిణి ఎమ్మెమ్మెస్’ ‘వీర్ దే వెడ్డిండ్’ ‘హాఫ్ గర్ల్ ఫ్రెండ్’ తదితర చిత్రాలను సైతం నిర్మించారు ఏక్తా. నలభై ఏళ్ళు దాటినా… ఇంకా ఈ లేడీ ప్రొడ్యూసర్ పెళ్ళి చేసుకోకపోవడం గమనార్హం. కానీ సరోగసి అనే పద్ధతి ద్వారా తాజాగా ఓ బిడ్డకు జన్మనిచ్చింది ఏక్తా కపూర్. జనవరి 27న ఆమె తల్లయిందట. ఇక త్వరలోనే తన బిడ్డను ఇంటికి తీసుకురానున్నారు ఏక్తా కపూర్.

ఇదిలా ఉండగా… గతంలో ఏక్తాకపూర్ తమ్ముడు.. తుషార్ కపూర్ కూడా ఇలానే సరోగసి పద్ధతి ద్వారా ఓ ఆడబిడ్డకు తండ్రి అయ్యాడు. ఆ పాపతో ఏక్తాకపూర్ ఎంతో ప్రేమగా మెలిగే సంగతి తెలిసిందే. ఎప్పటికప్పుడు… ఆ చిన్నారితో ఉన్న ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసేది కూడా. ఇప్పుడు తమ్ముడి బాటలోనే.. ఏక్తా కూడా సరోగసి పద్ధతి ద్వారా ఇలా ఓ బిడ్డకి జన్మనిచ్చిందన్నమాట. అప్పట్లో ఏక్తా కొందరు బాలీవుడ్ ప్రముఖులతో డేటింగ్ చేసేదని వార్తలు వచ్చేవి. అయినప్పటికీ ఈమె పెళ్ళి చేసుకోలేదు. ఇక తనకి పెళ్ళి చేసుకోవాలని లేదంటూ.. పలు సందర్భాల్లో చెప్పింది కూడా. అయితే పిల్లల మీద ఉన్న ఇష్టంతో ఓ బిడ్డకు అమ్మయిందని స్పష్టం అవుతుంది.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus