Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Reviews » Epic Review in Telugu: ‘ఎపిక్’ సినిమా రివ్యూ & రేటింగ్!

Epic Review in Telugu: ‘ఎపిక్’ సినిమా రివ్యూ & రేటింగ్!

  • September 11, 2026 / 07:14 AM ISTByPhani Kumar
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp
Epic Review in Telugu: ‘ఎపిక్’ సినిమా రివ్యూ & రేటింగ్!

Cast & Crew

  • ఆనంద్ దేవరకొండ (Hero)
  • వైష్ణవి చైతన్య (Heroine)
  • శివాజీ, వాసుకి, కాదంబరి, కళ్యాణ్ శంకర్, శ్రీనివాస్ గవిరెడ్డి తదితరులు (Cast)
  • ఆదిత్య హాసన్ (Director)
  • నాగవంశీ, సాయి సౌజన్య (Producer)
  • హేషమ్ అబ్దుల్ వహాబ్ (Music)
  • అజీమ్ మహమ్మద్ (Cinematography)
  • నవీన్ నూలి (Editor)
  • Release Date : సెప్టెంబర్ 11 2026
  • సితార ఎంటర్టైన్మెంట్స్ (Banner)

’90’s’ వెబ్ సిరీస్‌తో భీభత్సమైన క్రేజ్ సంపాదించుకున్నాడు దర్శకుడు ఆదిత్య హాసన్. అతను తెరకెక్కించిన తొలి థియేట్రికల్ మూవీ ‘ఎపిక్’. బేబీ తర్వాత ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య హీరో హీరోయిన్లుగా నటించిన సినిమా కావడంతో మొదటి నుంచీ ఇది మంచి హైప్‌ను సొంతం చేసుకుంది. పైగా 90’sకి ఇది సీక్వెల్ కూడా కావడంతో అంచనాలు మరింతగా పెరిగాయి. మరి ఆ అంచనాలను ఈ సినిమా ఎంతవరకు అందుకుందో తెలుసుకుందాం రండి:

Epic Movie Review

Epic Movie Review and Rating

కథ: ఆదిత్య (ఆనంద్ దేవరకొండ) చంద్రశేఖర్ (శివాజీ), రాణి (వాసుకి) దంపతుల చిన్న కొడుకు. ఇతను డైరెక్టర్ అవ్వాలని కలలు కంటూ ఉంటాడు. ఈ క్రమంలో తను తీసిన షార్ట్ ఫిలింకు 12 వేల వ్యూస్ రావడంతో అతనిలో మరింత కాన్ఫిడెన్స్ వస్తుంది. కానీ వేరేవాళ్ల మాటలు విని చంద్రశేఖర్, ఆదిత్యను పై చదువుల కోసం యూకే (UK) పంపించేస్తాడు. అక్కడ ఆదిత్యకు కడలి (వైష్ణవి) పరిచయం అవుతుంది. ఒక్కరోజులోనే వీళ్లు చాలా క్లోజ్ అవుతారు. ఆ తర్వాత ఆదిత్య రూమ్‌కు కడలి షిఫ్ట్ అవుతుంది. ఇద్దరూ ఎలాంటి ఎమోషన్స్ లేకుండా ఓ రిలేషన్‌షిప్ బిల్డ్ చేసుకుంటారు. ఫిజికల్‌గా ఒకటవుతారు. తర్వాత పెళ్లి చేసుకుని సెటిల్ అవుదాం అనుకుంటారు. కానీ కొన్ని కారణాల వల్ల మధ్యలో బ్రేకప్ చెప్పుకుంటారు. దానికి గల కారణాలు ఏమిటి? చివరికి వీళ్లు కలుసుకున్నారా? ఈ ప్రశ్నలకు సమాధానమే మిగిలిన సినిమా.

Epic Movie Review and Rating

నటీనటుల పనితీరు: ‘బేబీ’తో సూపర్ హిట్ పెయిర్ అనిపించుకున్న ఆనంద్ దేవరకొండ, వైష్ణవి ఈ సినిమాకు ప్రధాన బలం. ఆదిత్య అనే అమాయకపు కుర్రాడిగా ఆనంద్ చాలా నేచురల్‌గా పెర్ఫార్మ్ చేశాడు. అతని బాడీ లాంగ్వేజ్ కూడా ఇందులో బాగుంది. మునుపటి సినిమాలతో పోలిస్తే, ఆనంద్ నటుడిగా ఇంప్రూవ్ అయ్యాడు. అయితే ఆనంద్ కంటే వైష్ణవి కొంచెం ఎక్కువ మార్కులు కొట్టేసిందని చెప్పాలి. ఇలాంటి పాత్రను ఆమె ఈ టైమ్‌లో ఓకే చేయడం కూడా ఒక ఛాలెంజ్ అనే చెప్పాలి. ఎందుకంటే ‘బేబీ’తో వైష్ణవిపై కొన్ని విమర్శలు వచ్చాయి. వాటిని అధిగమించే క్రమంలో ‘లవ్ మీ’, ‘జాక్’ వంటి కంటెంట్ లేని సినిమాలు చేసి తన ఇమేజ్‌ను కొంతవరకు డ్యామేజ్ చేసుకుంది. అయితే కడలి పాత్రలో ఆమె ఒదిగిపోయింది. ఆమె మేకోవర్ కావచ్చు, లవ్ మేకింగ్ సీన్స్‌లో కావచ్చు, ఎమోషనల్ సీన్స్‌లో కావచ్చు.. వైష్ణవి తన బెస్ట్ ఇచ్చేసింది. కాకపోతే క్లైమాక్స్‌లో ఈమె పాత్రకు ఇచ్చిన ఎండింగ్ ఎందుకో అంత కన్విన్సింగ్‌గా అనిపించదు.ఇకపోతే తండ్రి పాత్రలో శివాజీ కూడా చాలా ఈజ్‌తో పెర్ఫార్మ్ చేశాడు. వాసుకి కూడా బాగా చేసింది. వీళ్ల సీన్స్ ఇంకొన్ని ఉంటే బాగుండు అనేలా ఉన్నాయి. కళ్యాణ్ శంకర్ రోల్ కూడా కథలో కీలకం అయ్యింది. అతను పలికే డైలాగులు కొన్ని యూత్‌ను అమితంగా ఆకట్టుకుంటాయి. శ్రీనివాస్ గవిరెడ్డి కూడా బాగానే చేశాడు. మిగతా నటీనటులు ఓకే.

Epic Movie Review and Rating

సాంకేతిక నిపుణుల పనితీరు: ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో హీరో ఆనంద్ దేవరకొండ చెప్పినట్టు.. నిజంగానే ఇది ఒక మామూలు కథ. కానీ చాలా బలంగా చెప్పిన కథ. కమర్షియల్ ట్విస్టులు ఉండవు, ఇంటర్వెల్ బ్యాంగ్ ఉండదు, క్లైమాక్స్‌లో రక్తపాతం ఉండదు. అయినప్పటికీ సినిమాలో చాలా చోట్ల కొన్ని సన్నివేశాలు బాగా పేల్తాయి. ఉదాహరణకు ఫస్ట్ హాఫ్ చూసుకుంటే.. కేవలం 2, 3 సన్నివేశాలే ఉంటాయి. హీరో అమెరికా రావడం.. హీరోయిన్‌ను కలవడం.. ఆమెతో లివింగ్ రిలేషన్‌షిప్ మొదలుపెట్టడం, ఆమెతో ఫిజికల్‌గా ఒకటవ్వడం.. ఇంతే! కానీ ఆ సన్నివేశాలను కూడా దర్శకుడు ఆదిత్య చాలా బాగా హ్యాండిల్ చేశాడు. ముఖ్యంగా రైటింగ్‌తో మ్యాజిక్ చేశాడు. హీరో కన్ఫ్యూజన్, హీరోయిన్ ఇన్‌సెక్యూరిటీస్‌ను వివరిస్తూ వచ్చే కొన్ని సంభాషణలు బాగుంటాయి.

సెకండాఫ్‌ను క్లైమాక్స్ వరకు ఇంకా సెన్సిబుల్‌గా హ్యాండిల్ చేశాడనిపిస్తుంది. ముఖ్యంగా హీరోయిన్ నెలసరి టైంలో పడే ఇబ్బందులను, దానిని హీరో అర్థం చేసుకుని నడుచుకునే తీరును చాలా మెచ్యూర్డ్‌గా డీల్ చేశాడు ఆదిత్య. ఆ తర్వాత హీరోయిన్ తన స్నేహితురాలితో ఒక డైలాగ్ చెబుతుంది.. ‘వీడికి పుట్టే కూతురు చాలా అదృష్టవంతురాలు’ అని! అది సింపుల్ డైలాగే కానీ, అందులో కూడా చాలా డెప్త్ కనిపిస్తుంది. అలాగే హీరోకు, తండ్రికి మధ్య వచ్చే ఫోన్ కాల్ సన్నివేశం కూడా అందరూ ఎమోషనల్‌గా కనెక్ట్ అయ్యేలా చేస్తుంది. అయితే క్లైమాక్స్‌ను సడన్‌గా ముగించిన తీరు మాత్రం కొంత డిజప్పాయింట్ చేస్తుంది. అలాగే సినిమాలో దర్శకుడు చాలా సినిమాటిక్ లిబర్టీస్ తీసుకున్నాడు. వాటికి కన్విన్స్ అయ్యేవాళ్లు తక్కువ మందే ఉండొచ్చు. అవి పక్కన పెట్టేస్తే.. నిర్మాణ విలువలు బాగున్నాయి. కథకు ఎక్కడా లోటు చేయలేదు. సంగీతం కూడా సినిమాకు మేజర్ ప్లస్ పాయింట్. పాటలన్నీ బాగున్నాయి. బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ కూడా సినిమా మూడ్‌కు తగ్గట్టు చాలా బాగా కుదిరింది. సినిమాటోగ్రఫీ కూడా సినిమాకు రిచ్‌నెస్ తీసుకొచ్చింది.

Epic Movie Review and Rating

విశ్లేషణ: ‘ఎపిక్’.. పూర్తిగా యూత్‌ను దృష్టిలో పెట్టుకుని తీసిన సినిమా. కెరీర్ పట్ల వాళ్లకు ఉండే కన్ఫ్యూజన్స్, ఫ్యూచర్ పట్ల ఉండే ఇన్‌సెక్యూరిటీస్, తల్లిదండ్రుల పట్ల ఉండాల్సిన లాయల్టీ వంటి అంశాలను సెన్సిబుల్‌గా, బోల్డ్‌గా చెప్పే ప్రయత్నం చేశారు. అయితే ఈ సినిమా రిలీజ్ తర్వాత చాలా డిస్కషన్స్‌కు దారితీసే అవకాశం ఉంది. ఓటీటీలో అందుబాటులోకి వచ్చాక ఆ చర్చలు మరింత పెరగొచ్చు.

ఫోకస్ పాయింట్: జెంజీ యువత బయోపిక్‌ లాంటి ‘ఎపిక్’

రేటింగ్: 3/5

Rating

3
Read Today's Latest Reviews Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #adithya hassan
  • #Anand Deverakonda
  • #epic
  • #Epic Review
  • #Sivaji

Reviews

Impure Review in Telugu: ఇంప్యూర్ సినిమా రివ్యూ & రేటింగ్!

Impure Review in Telugu: ఇంప్యూర్ సినిమా రివ్యూ & రేటింగ్!

Tatvam Review in Telugu: తత్వం సినిమా రివ్యూ & రేటింగ్!

Tatvam Review in Telugu: తత్వం సినిమా రివ్యూ & రేటింగ్!

Anakapalli Review in Telugu: అనకాపల్లి సినిమా రివ్యూ & రేటింగ్!

Anakapalli Review in Telugu: అనకాపల్లి సినిమా రివ్యూ & రేటింగ్!

Sigma Review in Telugu: సిగ్మా సినిమా రివ్యూ & రేటింగ్!

Sigma Review in Telugu: సిగ్మా సినిమా రివ్యూ & రేటింగ్!

related news

Vijay Devarakonda: విజయ్‌ దేవరకొండ లిస్ట్‌లో 2 సినిమాలకు రెడ్‌ టిక్‌.. నెక్స్ట్‌ ఏంటో?

Vijay Devarakonda: విజయ్‌ దేవరకొండ లిస్ట్‌లో 2 సినిమాలకు రెడ్‌ టిక్‌.. నెక్స్ట్‌ ఏంటో?

Epic Collections: మొదటి వారం 50 శాతం రికవరీ కూడా సాధించలేకపోయిన ‘ఎపిక్’

Epic Collections: మొదటి వారం 50 శాతం రికవరీ కూడా సాధించలేకపోయిన ‘ఎపిక్’

Vaishnavi Chaitanya: వైష్ణవికి మరో ఛాన్స్ ఇచ్చిన ‘సితార ఎంటర్టైన్మెంట్స్’

Vaishnavi Chaitanya: వైష్ణవికి మరో ఛాన్స్ ఇచ్చిన ‘సితార ఎంటర్టైన్మెంట్స్’

Epic Collections: మొదటి వీకెండ్ కి కేవలం 33 శాతమే రికవరీ సాధించిన ‘ఎపిక్’

Epic Collections: మొదటి వీకెండ్ కి కేవలం 33 శాతమే రికవరీ సాధించిన ‘ఎపిక్’

Epic Collections: 2వ రోజు తగ్గిన ‘ఎపిక్’ కలెక్షన్స్..ఎంతంటే?

Epic Collections: 2వ రోజు తగ్గిన ‘ఎపిక్’ కలెక్షన్స్..ఎంతంటే?

Epic Collections: యావరేజ్ ఓపెనింగ్స్ తో సరిపెట్టుకున్న ‘ఎపిక్’

Epic Collections: యావరేజ్ ఓపెనింగ్స్ తో సరిపెట్టుకున్న ‘ఎపిక్’

trending news

Singeetam Srinivasa Rao: చిరుతో మాత్రమే కాదు పవన్ కళ్యాణ్ తో కూడా ఆగిపోయిన సింగీతం ప్రాజెక్ట్

Singeetam Srinivasa Rao: చిరుతో మాత్రమే కాదు పవన్ కళ్యాణ్ తో కూడా ఆగిపోయిన సింగీతం ప్రాజెక్ట్

5 hours ago
Tella Kagitham Collections: మొదటి వీకెండ్ కి 32 శాతం రికవరీ సాధించిన ‘తెల్లకాగితం’

Tella Kagitham Collections: మొదటి వీకెండ్ కి 32 శాతం రికవరీ సాధించిన ‘తెల్లకాగితం’

6 hours ago
Don’t Trouble the Trouble Collections: వీకెండ్ కి కేవలం 14 శాతం మాత్రమే రికవరీ సాధించింది

Don’t Trouble the Trouble Collections: వీకెండ్ కి కేవలం 14 శాతం మాత్రమే రికవరీ సాధించింది

7 hours ago
37 Years For Siva: టాలీవుడ్ రేంజ్ పెంచిన ‘శివ’కి 37 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

37 Years For Siva: టాలీవుడ్ రేంజ్ పెంచిన ‘శివ’కి 37 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

13 hours ago
The Paradise Collections: బ్రేక్ ఈవెన్ కి చేరువలో ‘ది పారడైజ్’

The Paradise Collections: బ్రేక్ ఈవెన్ కి చేరువలో ‘ది పారడైజ్’

13 hours ago

latest news

The Paradise Collections: ‘ది పారడైజ్’ చివర్లో అవస్థలు పడుతోందిగా

The Paradise Collections: ‘ది పారడైజ్’ చివర్లో అవస్థలు పడుతోందిగా

5 hours ago
Magic Move ments: ‘మ్యాజిక్ మూవ్ మెంట్స్’ ఫస్ట్ లుక్ పోస్టర్ ను లాంచ్ చేసిన హీరో శ్రీకాంత్

Magic Move ments: ‘మ్యాజిక్ మూవ్ మెంట్స్’ ఫస్ట్ లుక్ పోస్టర్ ను లాంచ్ చేసిన హీరో శ్రీకాంత్

12 hours ago
Jailer 2 Trailer Review: ‘సర్దార్ 2’ను తలపిస్తున్న ‘జైలర్ 2’ ట్రైలర్.. కానీ ఆ కేమియో ఏ స్టార్‌ది?

Jailer 2 Trailer Review: ‘సర్దార్ 2’ను తలపిస్తున్న ‘జైలర్ 2’ ట్రైలర్.. కానీ ఆ కేమియో ఏ స్టార్‌ది?

1 day ago
Rashmika: విజయ్‌ని ఎలా పిలిస్తే పలుకుతాడో చెప్పిన రష్మిక.. మాట విన్నాక…

Rashmika: విజయ్‌ని ఎలా పిలిస్తే పలుకుతాడో చెప్పిన రష్మిక.. మాట విన్నాక…

1 day ago
Tollywood: సమస్య నాది కాదు అనుకోవద్దు.. సినిమా నటులారా.. ఇకనైనా రియాక్ట్‌ అవ్వండి

Tollywood: సమస్య నాది కాదు అనుకోవద్దు.. సినిమా నటులారా.. ఇకనైనా రియాక్ట్‌ అవ్వండి

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version