సినిమా రంగంలో అడుగుపెడతానంటే అబ్బాయిలను ప్రోత్సహించినట్టుగా.. అమ్మాయిలను పేరెంట్స్ ప్రోత్సహించరు. కారణం ఎక్స్ పోజింగ్. ఎంత నటించినప్పటికీ.. ప్రస్తుత కాలంలో అందాలు ఆరబోయాలిసిందే. ఈ విషయం తనకు సినిమా రంగంలో ప్రవేశించేటప్పుడే తెలుసని క్యూట్ బ్యూటీ సమంత వెల్లడించింది. ఆమె విశాల్ పక్కన నటించిన తమిళ చిత్రం “ఇరుంబు తిరై (అభిమన్యుడు)” మార్చి 29న తెలుగు, తమిళ భాషల్లో విడుదల కానుంది. ఇదే రోజున సమంత జమునగా నటించిన సావిత్రి బయోపిక్ “మహానటి” కూడా విడుదల కానుంది. ఇక మెగా పవర్‌స్టార్ రామ్‌చరణ్‌తో తొలిసారి సమంత నటించిన “రంగస్థలం” మార్చి 30న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ సినిమాల షూట్స్ కంప్లీట్ చేసిన సమంత ప్రస్తుతం “సూపర్ డీలక్స్” అనే తమిళ చిత్రంలో విజయ్‌కి జోడీగా నటిస్తోంది.
ఈ సినిమా షెడ్యూల్ గ్యాప్ లో మీడియాతో సంచలన కామెంట్స్ చేసింది. “సినీ రంగంలోకి వచ్చే ముందే అన్ని తెలుసుకున్నానని .. గ్లామర్ విషయంలో మొహమాటం పనికిరాదని తెలిసే వచ్చాను. నాకు స్కిన్ షో చేయడం పెద్దగా నచ్చదు .. కానీ ఇక్కడ నిలదొక్కుకోవాలంటే తప్పదు” అని చెప్పింది. గత ఏడాది అక్కినేని ఇంట కోడలిగా అడుగు పెట్టిన ఈ బ్యూటీ.. పెళ్లి తర్వాత కూడా నటిగా కొనసాగుతోంది. ఇతర హీరోలతో పాటు తన భర్త నాగచైతన్యతో మళ్ళీ నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.