గుంటూరు బ్యాక్ డ్రాప్ లో ఆనంద్ దేవరకొండ రెండో సినిమా

“దొరసాని” డిజాస్టర్ అనంతరం విజయ్ దేవరకొండ తమ్ముడు ఆనంద్ దేవరకొండ ఎదుర్కొన్న నెగిటివిటీ & ట్రోలింగ్ మాములుది కాదు. సినిమా ఫ్లాప్ అయ్యింది అనే బాధకంటే.. నటుడిగా అతడికి వచ్చిన ఫీడ్ బ్యాక్ కి ఎక్కువగా ఫీల్ అవ్వాల్సిన పరిస్థితి ఎదురైంది ఆనంద్ దేవరకొండకి. అయితే.. ఆ నెగిటివిటీని, ట్రోలింగ్ ను పక్కన పెట్టి తన సెకండ్ సినిమాకి రంగం సిద్ధం చేసుకొంటున్నాడు ఆనంద్. ఈసారి కూడా కొత్త దర్శకుడితోనే సినిమా చేయనున్నాడు ఆనంద్.

వినోద్ అనే యువ దర్శకుడి దర్శకత్వంలో భవ్య క్రియేషన్స్ పతాకంపై తెరకెక్కనున్న ఓ చిత్రంలో ఆనంద్ కథానాయకుడిగా నటించనున్నాడు. తమిళ కథానాయకి వర్ష బొల్లమ్మ హీరోయిన్ గా నటించనున్న ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్ త్వరలో మొదలవ్వనుంది. గుంటూరు నేపధ్యంలో ఈ సినిమా ఉండబోతోందని వినికిడి. సెకండ్ సినిమాతో కామెడీ యాంగిల్ ట్రై చేయనున్నాడు ఆనంద్.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus