ఛలో సినిమాపై రోజురోజుకి పెరుగుతున్న అంచనాలు

‘చూసి చూడంగానే నచ్చాసావే’ అంటూ వచ్చిన పాట.. నిజంగానే విన్నవెంటనే అందరికీ నచ్చేసింది. అప్పటి నుంచి చలో మూవీ గురించి మాట్లాడుకోవడం మొదలయింది. ఈ సినిమా ఎవరిది? ఎవరా హీరో అంటూ అడిగేవారు పెరిగారు. ఓ లెక్కన చెప్పాలంటే అక్కడ నుంచే అంచనాలు మొదలయ్యాయి. మహతి సర్వ సాగర్ కంపోజ్ చేసిన ఈ ఒక్క పాట మాత్రమే కాదు.. ఇందులోని అన్ని పాటలు యువతను ఆకట్టుకున్నాయి. ఊహలు గుసగుసలాడే సినిమా ద్వారా కూల్ గా ఎంట్రీ ఇచ్చిన నాగశౌర్య ఆ తర్వాత దిక్కులు చూడకు రామయ్య.. జ్యో అచ్చుతానందా వంటి సినిమాలతో తనకంటూ ఓ గుర్తింపు సంపాదించుకున్నారు.

ఇప్పుడు ఛలో మూవీ చేశారు. వెంకీ కుడుముల దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా మొదటి నుంచి ఆకర్షిస్తోంది. కన్నడ బ్యూటీ రష్మిక హీరోయిన్ గా నటించిన ఈ సినిమా చిత్ర టీజర్ ని మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ తో రిలీజ్ చేయడంతో.. ఇందులో ఏదో ప్రత్యేకత ఉంటుందని సినీ అభిమానులు ఓ నిర్ణయానికి వచ్చారు. అలాగే ఈ సినిమా ప్రీ రిలీజ్ ఫంక్షన్ ని గ్రాండ్ గా నిర్వహించారు. మెగాస్టార్ చిరంజీవి ఈ వేడుకలో మాట్లాడిన విధానం ప్రేక్షకులకే కాదు డిస్ట్రిబ్యూటర్స్ కి నమ్మకం కలిగించింది. అందుకే ఈ సినిమా భారీగా ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగి టేబుల్ ప్రాఫిట్ సాధించింది. ఐరా క్రియేషన్స్ బ్యానర్లో ఉషా ముల్పూరి నిర్మించిన ఛలో ఫిబ్రవరి 2 న రిలీజ్ కానుంది.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus