రాజమౌళి పై షాకింగ్ కామెంట్స్ చేసిన ప్రముఖ కొరియోగ్రఫర్..!

ఎన్టీఆర్ … రాజమౌళికి ద్రోహం చెయ్యడమేంటి. ‘ఎన్టీఆర్ లో నెంబర్ వన్ హీరో కనిపిస్తాడు.. అతనితో సినిమా చెయ్యాలి అని నా గుండె ఎప్పుడూ కొట్టుకుంటూనే ఉంటుంది. అతనితో నేను సినిమా చెయ్యడం మొదలుపెడితే రెండేళ్ళ వరకూ టైం పడుతుంది. అభిమానులు దానికి ఫిక్స్ అయినప్పుడు నన్ను అడగండి’ అంటూ రాజమౌళి గతంలో చెప్పిన మాటలు ఇవి. ఇద్దరి కెరీర్లు.. ఇంచు మించు ఒకేసారి మొదలయ్యాయి. ఎన్టీఆర్- రాజమౌళి ఇద్దరూ ఎంతో సన్నిహితంగా ఉంటారు.

అలాంటిది రాజమౌళి పోయి పోయి ఎన్టీఆర్ కు ఏం ద్రోహం తలపెడతాడు.? అంటూ ఎన్టీఆర్.. అభిమానులతో పాటు రాజమౌళి అభిమానుల్లోనూ ఈ అనుమానాలు నెలకొన్నాయి.? అయితే ఇటీవల ఓ కొరియోగ్రాఫర్ చేసిన కామెంట్స్ వల్ల ఇలాంటి అనుమానాలు నెలకొన్నాయి. ఇటీవల రాకేష్ మాష్టర్ అనే కొరియోగ్రాఫర్ పలు యూట్యూబ్ ఛానెల్స్ కు ఇంటర్వ్యూలు ఇస్తూ.. కొందరు సెలబ్రిటీల పై ఇష్టమొచ్చిన కామెంట్స్ చేస్తున్నాడు. ఇప్పుడు రాజమౌళిని టార్గెట్ చేసాడు. ‘ఆర్.ఆర్.ఆర్’ చిత్రానికి సంబంధించి చరణ్ పుట్టిన రోజున అతని లుక్ కు సంబంధించి టీజర్ విడుదల చేసాడు జక్కన్న. అయితే ఎన్టీఆర్ పుట్టిన రోజున మాత్రం రాజమౌళి ఎటువంటి వీడియోని విడుదల చెయ్యలేదు.

కనీసం పోస్టర్ ను కూడా విడుదల చెయ్యలేదు. ‘మెగా ఫ్యామిలీనే కావాలని.. రాజమౌళితో ఎన్టీఆర్ వీడియో కానీ.. అతని పాత్రకు సంబంధించి లుక్ ను కానీ.. విడుదల చెయ్యనివ్వలేదు’ అని చెప్పిఉంటారని. దాంతో రాజమౌళి.. ఎన్టీఆర్ కు ద్రోహం చేసినట్టు’ చెప్పుకొచ్చాడు రాకేష్ మాష్టర్. ‘ఇతను చేసిన ఈ కామెంట్స్ మెగా మరియు నందమూరి ఫ్యామిలీ అభిమానుల మధ్య చిచ్చు పెట్టినట్టు ఉన్నాయి.. కానీ అంత ఘోరమైన ఆలోచనలు మెగా ఫ్యామిలీ మరియు రాజమౌళికి లేదు’ అని అంతా నమ్ముతున్నారు.

Most Recommended Video

మేకప్‌ లేకుండా మన టాలీవుడ్ ముద్దుగుమ్మలు ఎలా ఉంటారో తెలుసా?
జ్యోతిక ‘పొన్‌మగల్‌ వందాల్‌’ రివ్యూ
ఈ డైలాగ్ లు చెప్పగానే గుర్తొచ్చే హీరోయిన్లు!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus