సమంత లేటెస్ట్ ఫోటోలపై ఆగ్రహం వ్యక్తం చేసిన అభిమానులు

  • September 26, 2018 / 11:07 AM IST

టాలీవుడ్ క్యూట్ బ్యూటీ సమంతకు సహజంగానే అభిమానులు ఎక్కువ. అక్కినేని ఇంట కోడలిగా అడుగుపెట్టిన తర్వాత ఫ్యాన్స్ మరింత పెరిగారు. ఇది ఒక విధంగా సంతోషించదగ్గ విషయమే కానీ.. మరో విధంగా బాధపెడుతోంది. అది ఎలాగంటే.. సమంత నటించిన యూ టర్న్, నాగచైతన్య శైలజా రెడ్డి అల్లుడు సినిమాలు విజయం సాధించడంతో ఇద్దరూ కలిసి విహారానికి వెళ్లారు. ఇద్దరూ కలిసి స్పెయిన్ దేశంలో ఎంజాయ్ చేస్తున్నారు. తమ టూర్ కి సంబంధించిన ఫోటోలను సమంత ఇన్‌స్టాగ్రామ్ లో పోస్ట్ చేసింది. ఈ ఫోటోలకు మిశ్రమ స్పందన వచ్చింది. కొంతమంది బాగున్నాయని ప్రశంసిస్తుంటే.. మరికొంతమంది విమర్శలు గుప్పిస్తున్నారు. “అభిమానులుగా ఏది కరెక్టో.. ఏది తప్పో చెప్పే బాధ్యత మాపై ఉంది. ఇలాంటి డ్రెస్సులు నువ్వు వేసుకోవడం మాకు నచ్చడం లేదు.

దయచేసి మరోసారి ఇలాంటి ఫోటోలు పోస్టు చేయకండి మేడమ్”… “నీకు పెళ్లయింది… నీపై గౌరవం ఉంది… దయచేసి ఇలాంటి డ్రెస్సులు వేయవద్దు” అని కొంతమంది సలహా ఇస్తుంటే.. “ఈ ఫోటో చాలా చండాలంగా ఉంది, ఇలాంటి ఫోటోల్లో నిన్ను చూడాలనుకోవడం లేదు, వెంటనే ఈ ఫోటో తీసేయ్” అంటూ ఆర్డర్ వేస్తున్నారు. “డ్రెస్సు బాగానే ఉంది కానీ ఇది నీకు సూటవ్వలేదు” అంటూ సున్నితంగా చెప్పేవారు లేకపోలేదు. ప్రశంసలను, విమర్శలను సమంత సమానంగా తీసుకుంది. ఫోటోలను మాత్రం తీయలేదు.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus